Vishal Kusum Love Story : 10 రూపాయల నోటు విశాల్, కుసుమ్ లను కలిపిందా.. ?

10 రూపాయల నోటుపై ప్రేమ కథను పంచుకున్న కుసుమ్-విశాల్‌లు నిజ జీవితంలో కలుసుకున్నారా? వారి ప్రేమ కథ కంచికి చేరిందా? కరెన్సీ నోటుపై ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.

Vishal Kusum Love Story

Vishal Kusum Love Story :  చాలామంది కరెన్సీ నోట్ల మీద ఏవో రాతలు రాస్తుంటారు. నిజానికి అలా రాయడం నేరమే. కొంతమంది ఇవేమీ పట్టించుకోరు. ఏకంగా కరెన్సీ నోటుపై లవ్ స్టోరీలు నడిపించేస్తున్నారు. ఓ ఫన్నీ లవ్ స్టోరీ చదవండి.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో ఏవి నిజమో.. ఏవి అబ్ధమో కూడా తెలియదు. కొన్ని బాధని..కొన్ని సంతోషాన్ని.. కొన్ని స్ఫూర్తిని..కొన్ని నవ్వుని పుట్టిస్తాయి. 2022 ఏప్రిల్ 26న కుసుమ్ (kusum) అనే అమ్మాయి విశాల్ (vishal) అనే తన ప్రేమికుడికి 10 రూపాయల నోట్ మీద ‘ముఝే భాగ కే లే జానా” అని రాసింది. ఈ నోట్‌ను @vipul2777  అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది కాస్త అప్పట్లో వైరల్ అయ్యింది. ఇక యూజర్లంతా ఏకమై ఆ జంటకు సాయం చేయాలనుకున్నారు. విశాల్‌కి ఆ సందేశం చేరేవరకూ షేర్ చేయాలంటూ తెగ పోస్టులు పెట్టారు. ఇది జరిగి కరెక్ట్‌గా ఏడాది కావొస్తొంది. విశాల్ కుసుమ్ లవ్ స్టోరీని అంతా మర్చిపోయారు. తాజాగా కుసుమ్ పోస్ట్ మరలా బయటకు వచ్చింది.

Zero Rupee Note : భారత్ లో ’సున్నా‘ రూపాయి నోటు గురించి తెలుసా..?!

ఇక ఇప్పుడు ఈ  పోస్ట్‌కి రీసెంట్ గా విశాల్ ధావన్ అనే యూజర్ రిప్లై ఇచ్చారు. ‘కుసుమ్ నీ మెసేజ్ నా వరకూ చేరింది.. నేను నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాను’ అంటూ 10 రూపాయల నోటుపై రిప్లై ఇచ్చారు. ఏడాది తర్వాత ఆ రిప్లై ఇచ్చింది నిజంగా విశాలేనా? కుసుమ్ నిజంగా విశాల్‌ని చేరిందా? వారి ప్రేమ కథ ఫలించిందా? కుసుమ్-విశాల్‌లు స్వయంగా పోస్ట్ పెట్టి చెప్పేవరకూ ఇలా అన్నీ ప్రశ్నలే. ప్రస్తుతం ఈ రెండు నోట్లపై నడుస్తున్న ప్రేమకథకు ట్విట్టర్‌లో కామెంట్ల రూపంలో నవ్వులు పువ్వులు పూస్తున్నాయి.