Zero Rupee Note : భారత్ లో ’సున్నా‘ రూపాయి నోటు గురించి తెలుసా..?!

10 నుంచి 2వేల వరకూ ఉన్న అన్ని నోట్లను అందరం చూస్తాం. కానీ భారత్ లో ’సున్నా‘ రూపాయి నోటు ఉందనే విషయం తెలుసా..?!

Zero Rupee Note : భారత్ లో ’సున్నా‘ రూపాయి  నోటు గురించి తెలుసా..?!

India Zero Rupee Note

India Zero rupee note : మన దేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంకు ముద్రిస్తుందనే విషయం తెలిసిందే. గతంలో రూపాయి, రెండురూపాయలు, ఐదు రూపాయల నుంచి 100 రూపాల నోట్లు ఉండేవి. ఆ తరువాత రూ.500,1000 నోట్లు కూడా వచ్చాయి. వాటిని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేశాక 2 వేల నోట్లు కూడా వచ్చాయి. అలా భారత్ లో రూపాయి నుంచి రెండు వేల రూపాల నోట్ల వరకు అన్నీ చూసే ఉంటాం. కానీ ‘0’ రూపాయ నోటు..అదేనండీ ‘సున్నా’రూపాయం నోటు ఎప్పుడన్నా చూశారా?! ఏంటీ సున్నా రూపాయి నోటా? అనే ఆశ్చర్యం కలుగుతుంది కదూ..అటువంటి నోటు ఒకటి భారత్ లో ఉంటుందని చాలామందికి తెలియదనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే ఈ ‘సున్నా’రూపాయం నోటును రిజర్వు బ్యాంకు ముద్రించదు. కానీ రిజర్వు బ్యాంకు ముద్రించినట్లుగానే ఈ సున్నా నోటుమీద కూడా అన్ని అధికారిక ముద్రణలు ఉంటాయి. ఆఖరికి మన జాతిపిత గాంధీగారి బొమ్మ కూడా ఉంటుంది.

Read more : Demonetisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?

మన నిత్య జీవితంలో 10 నుంచి 2వేల వరకూ ఉన్న అన్ని నోట్లను అందరం చూస్తాం. ఐతే..ఒక రూపాయి, 2రూపాయలు 5 నోట్లు ప్రస్తుతం చలామణిలో లేవు. కానీ ఈ సున్నా రూపాయి నోటు అనేది ఒకటి ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. దాదాపు 10ఏళ్ల ముందు నుంచే భారత దేశంలో వీటిని ముద్రిస్తున్నారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజంగా నిజం… ఈ సున్నా రూపాయల నోటును ఆర్‌బీఐ ముద్రించదు. మరి ఎవరి ముద్రిస్తారు? అనేది కూడా పెద్ద డౌటే..ఈ సున్నా రూపాయి నోటు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో తెలుసుకుందాం..

తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఫిఫ్త్ పిల్లర్ (5th Pillar) అనే స్వచ్ఛంద సంస్థ 2007లో మొదటిసారిగా ఈ సున్నా రూపాయల నోటును ముద్రించింది. లంచగొండితనాన్ని నివారిచేందుకు ‘5th పిల్లర్ అనే NGO సంస్థ’ ఈ సున్నా రూపాయల నోటును ప్రవేశపెట్టింది. లంచగొండి అధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే.. వారికి సున్నా రూపాయల నోటును ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. నోట్ కు మంచి స్పందన రావటంతో ఫిఫ్త్ పిల్లర్ సంస్థ.. తెలుగు, హింది, కన్నడ, మలయాళం, తదితర భాషాల్లో ఈ నోటును ముద్రిస్తోంది.

Readmore : మార్పు అంటే ఇదే : నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి

ఫిఫ్త్ పిల్లర్ తమిళనాడుకు చెందిన ఒక NGO మరియు ఇది మిలియన్ల కొద్దీ జీరో రూపాయల నోటును ముద్రించింది. ఆసక్తికరంగా, ఈ నోట్లను హిందీ, తెలుగు, కన్నడ మరియు మలయాళం వంటి భాషలలో ముద్రించారు. ఐ జీరో రూపాయి నోట్లను రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మరియు మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాలలో ఐదవ పిల్లర్ పంపిణీ చేసింది. ఈ నోటు ముఖ్య ఉద్ధేశం..అవినీతిపై పోరాటం చేసేవారు ఒంటరి కాదు అని తెలిపటానికి.

ఈనోటును అమెరికాలోని ఓ వర్శిటీకి చెందిన ఫిజిక్స్ ఆఫీసర్..ఏడీపీ డైరెక్టర్
సత్యేంద్ర మోహన్ క్రియేషనే ఈ సున్నా రూపాయి నోట్..యూఎస్ లోని వాషింగ్టన్ DCలోని తన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థను మూసివేసి..చెన్నైకి తిరిగి వచ్చారు సత్యేంద్ర మోహన్. తరువాత సత్యేంద్ర మోహన్ భారత్ లోని అవినీతిని చూసి ఆశ్చర్యపోయారు. చిన్న చిన్న పనులకే లంచాలు అడగటం గమనించారు. ఆందోళన చెందారు.

ఈ లంచాన్ని నిర్మూలించాలని లంచం అడిగే ఉద్యోగులకు నిరసన తెలపటానికి ఏదొకటి చేయాలని ఆలోచించారు. ఆయన ఆలోచన నుంచి పుట్టిందే ఈ సున్నా రూపాయ నోట్. అలా 5th Pillar NGO పిల్లర్‌ను ప్రారంభించారు సత్యేంద్ర మోహన్. అలా ఆయన ఆలోచనుంచి పుట్టిందే ఈ ‘సున్నా’ రూపాయి నోట్.