మార్పు అంటే ఇదే : నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి

నవంబర్ 8, 2016.. అనగానే టక్కున గుర్తుచ్చేది.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అప్పట్లో అందరిని షాక్ కు గురిచేసింది.

  • Published By: sreehari ,Published On : April 17, 2019 / 10:07 AM IST
మార్పు అంటే ఇదే : నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి

నవంబర్ 8, 2016.. అనగానే టక్కున గుర్తుచ్చేది.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అప్పట్లో అందరిని షాక్ కు గురిచేసింది.

నవంబర్ 8, 2016.. అనగానే టక్కున గుర్తుచ్చేది.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అప్పట్లో అందరిని షాక్ కు గురిచేసింది. పెద్ట నోట్ల రద్దు సమయంలోనే నిరుద్యోగ సమస్య మొదలైందని ఓ నివేదిక చెబుతోంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 50 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు న్యూ రిపోర్ట్ వెల్లడించింది. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సస్టయిన్బుల్ ఎంప్లాయిమెంట్ (APUCS) జరిపిన సర్వే ఆధారంగా బెంగళూరులో కొత్త నివేదిక రిలీజ్ అయింది.
Also Read : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే

స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 నివేదిక ప్రకారం.. దేశంలో నిరుద్యోగ సమస్య 2011 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని నివేదిక చెబుతోంది. 2018 ఏడాదిలో నిరుద్యోగ రేటు 6శాతానికి పెరిగిపోయింది. 2000 నుంచి 2011 మధ్యకాలంలో కంటే రెండింతలు పెరిగినట్టు తెలిపింది. కంజ్యూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ద సెంటర్ డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. గత జనవరిలోనే లీకైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా ఇండియాలో నిరుద్యోగం రేటు 45ఏళ్లలో 2017-18లో అత్యధికంగా 6.1శాతం రికార్డు అయినట్టు తెలిపింది. 

మహిళల్లోనే నిరుద్యోగ రేటు ఎక్కువ :  
ఉన్నత విద్య చదివిన 20 నుంచి 24ఏళ్ల వయస్సు కలిగిన వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లోని పనిచేసేవారి జనాభా 13.5 శాతం ఉంటే.. నిరుద్యోగులు 60 శాతం మంది ఉన్నారు. వీరిలో ఉన్నత చదువులు చదువుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తక్కువ చదువులు చదివిన ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు కోల్పోయారని, 2016 నుంచి ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయాయని తెలిపింది. ఉన్నత చదువులు చదివిన మహిళల్లోనే నిరుద్యోగ రేటు ఎక్కవ స్థాయిలో ఉంది. CMIE-CPDX దేశవ్యాప్తంగా మొత్తం 1లక్ష 60వేలు నివాసులు, 5లక్షల 22వేలు మంది వ్యక్తులపై సర్వే నిర్వహించింది.

ఈ సర్వేను నాలుగు (ప్రతి ఏడాది జనవరి ఆరంభంలో) నెలల్లో మూడు మార్గాల్లో నిర్వహించింది. తొలి దశాబ్దంలో 2-3 శాతం నిరుద్యోగ రేటు ఉండగా.. 2015లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018లో 6 శాతం మేర నిరుద్యోగ రేటు పెరిగినట్టు నివేదిక తెలిపింది. ఇదే సమయంలో మొత్తం మీద నిరుద్యోగ రేటు 3 శాతం రికార్డు అయితే.. విద్యావంతులై ఉండి.. నిరుద్యోగులుగా మారిన వారు 10శాతం వరకు పెరిగారు. 2011లో 9 శాతం పెరిగితే.. 2016లో 15 నుంచి 16 శాతం నిరుద్యోగ రేటు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. 
Also Read : కోట్లున్నక్రికెటర్ : ఫుట్ పాత్ పై వాచ్ కోసం గీసి గీసి బేరం