TheAccNZ: కోహ్లీని ఘోరంగా అవమానించిన వెబ్‌సైట్‌.. ఫ్యాన్స్ ఫైర్!

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీం ఇండియా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ ఓటమికి బాధ్యుడిగా తీవ్ర కామెంట్లు కూడా వచ్చాయి. అయితే.. అదంతా మన దేశంలోని అభిమానులు.. మన టీం మధ్య వ్యవహారం. కానీ ఇతర దేశానికి చెందిన ఓ వెబ్ సైట్ మన కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించింది.

TheAccNZ: కోహ్లీని ఘోరంగా అవమానించిన వెబ్‌సైట్‌.. ఫ్యాన్స్ ఫైర్!

Theaccnz

Updated On : June 26, 2021 / 7:36 AM IST

TheAccNZ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీం ఇండియా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ ఓటమికి బాధ్యుడిగా తీవ్ర కామెంట్లు కూడా వచ్చాయి. అయితే.. అదంతా మన దేశంలోని అభిమానులు.. మన టీం మధ్య వ్యవహారం. కానీ ఇతర దేశానికి చెందిన ఓ వెబ్ సైట్ మన కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. దీంతో ఇది చూసిన మన క్రికెట్ అభిమానులు ఆ వెబ్ సైట్ చేసిన పనిని తూర్పారపట్టేస్తున్నారు.

నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యాక కెప్టెన్ కోహ్లీపై ఇంటా బయటా అన్న తేడా లేకుండా మాజీ క్రికెటర్లు, అభిమానులు అతని కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత అటతీరుపై విమర్శలు చేస్తున్నారు. అదంతా మన క్రికెట్ అభిమానులు.. లేదంటే ఇతర దేశాలలోని మాజీ క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. కానీ.. క్రికెట్ తో ఎలాంటి సంబంధం లేని ఓ వెబ్ సైట్ ఇష్టారీతిన కోహ్లీని ఘోరంగా అవమానించింది.

న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ TheAccNZ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలయ్యాక ఓ ఫోటోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలో ఒక మహిళ బెల్ట్ తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్‌తో పోలస్తూ.. ఆ మనిషిని కోహ్లీతో పోల్చింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు ముఖ్యంగా కోహ్లీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆ వెబ్‌సైట్‌తో పాటు న్యూజిలాండ్‌ మొత్తాన్ని చీల్చిచెండాతున్నారు.