Body Pains : ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే మీకోసం చిట్కాలు!

బేకరీషాపుల్లో దొరికే చెర్రీస్ పండ్లు తింటే కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అప్పుడప్పుడు తినటం వల్ల నొప్పులకు ఇవి పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది.

Body Pains : ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే మీకోసం చిట్కాలు!

Body Pains (1)

Updated On : May 4, 2022 / 4:04 PM IST

Body Pains : శరీరంలో రక్తప్రసరణ సాఫీగా లేకపోయినా, ఇతరత్రా సమస్యలు ఉన్నా ఒళ్లంతా నొప్పులు అనిపిస్తుంటాయి. బాడీ పైన్స్ తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లీషు మందులు వాడుతుంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్దతిలో నొప్పులు తగ్గించుకునేందుకు కొన్ని రకాల చిట్కాలు చక్కగా ఉపకరిస్తాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కొంచెం అలీవ్ అయిల్ తీసుకుని దాంట్లో ఉప్పు వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను నొప్పి పై రాయాలి. దీని వల్ల నొప్పి తగ్గుతుంది. ఈ పేస్ట్ అన్ని రకాల నొప్పులకు ఉపయోగపడుతుంది. ఆలివ్ అయిల్ , ఉప్పులో ఉండే సహజ ఔషధ గుణాలు వివిధ రకాల నొప్పులను తగ్గించటంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి మూడు నిమిషాలపాటు వేడి చేయాలి. ఈ నీటితో స్నానం చేయటం వల్ల ఒళ్లు నొప్పులు తొలగిపోతాయి.

బేకరీషాపుల్లో దొరికే చెర్రీస్ పండ్లు తింటే కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అప్పుడప్పుడు తినటం వల్ల నొప్పులకు ఇవి పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది. వంటల్లో వాడు ఫుల్లిపాయను రంసం తీసి కొంచెం అలీవ్ అయిల్ తో కలపి కండరాలకు రాసుకుంటే మంచిఫలితం ఉంటుంది. దీంతో పాటు నొప్పులను తగ్గించటంలో అల్లంగా బాగా ఉపకరిస్తుంది. వాపులను తగ్గించే గుణం అల్లంలో ఉంది. మెగ్నీషియం, జింక్ అధికంగా ఉండే ఓట్స్ సైతం ఒళ్లు నొప్పులను తగ్గిస్తాయి. రక్త ప్రసరణను సాఫీగా చేయటం ద్వారా నొప్పులను తగ్గించేందుకు నల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది.

రాత్రి పడుకునే ముందు, ఒక గ్లాసు పాలను, ఒక చెంచా పసుపు కలిపి తాగాలి. దీని వలన ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకోవటం వల్ల అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో నొప్పులు తగ్గించేందుకు సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, రుచికి అనుగుణంగా తేనె కలిపుకుని తాగితే నొప్పులు తగ్గిపోతాయి.

గమనిక; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటం జరిగింది. వివిధ రకాల నొప్పులతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.