Tollywood : టికెట్ల పంచాయితీ కొలిక్కి వచ్చేనా ? టాలీవుడ్ ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ ఒకే చెబుతుందా ?

ఇటీవల చిరంజీవి, జగన్‌ మధ్య జరగిన చర్చపైనా సమీక్షించనున్నారు కమిటీ సభ్యులు. దీంతో ఇప్పుడు కమిటీ ప్రభుత్వానికి ఏం సిఫార్సు చేస్తుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది. కమిటీలో...

Tg Film

Tollywood Tickets Issue : కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఓ వైపు చిన్నా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నా…ఏపీలో మాత్రం ఇంకా టిక్కెట్ల పంచాయితీ కొలిక్కి రాలేదు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయిన కమిటీ.. మూడోసారి భేటీ అవుతోంది. ఈ మీటింగ్‌లో టికెట్‌ రేట్లపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బి, సి సెంటర్లలో సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు, పెద్ద సినిమాల రిలీజ్ టైంలో రెండు వారాల పాటు టిక్కెట్ల ధరలు పెంచుకునే అవకాశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇటు వరుసగా పెద్ద సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. కరోనా, టికెట్‌ రేట్ల వ్యవహారంతో ఆగిపోయిన సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల చివరి నుంచి వరుస పెట్టి మూవీస్‌ అన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి.

Read More : Vishwak Sen : విశ్వక్‌సేన్‌ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.. టీజర్ రిలీజ్.. మార్చ్ 4న థియేటర్స్‌లో..

మార్చి 25న ట్రిపుల్‌ ఆర్‌ విడుదల కానుంది. ఇటు ఈ నెల 25 కానీ ఏప్రిల్‌ ఒకటిన పవన్‌ కల్యాణ్‌ ప్రాజెక్టు భీమ్లా నాయక్‌ రిలీజ్‌ కానుంది. మార్చిలోనే మరో పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ మూవీ కూడా రానుంది. ఇటు ఏప్రిల్‌ 29న మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిన్నాచితకా సినిమాలు ఈ నెల నుంచే విడుదలకు రెడీ అయ్యాయి. ఇలా వరుస పెట్టి సినిమాలు వస్తున్నందున వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సినీ ఇండస్ట్రీ కోరుతోంది. ప్రభుత్వం కూడా ఈ సమస్యకు పుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సర్కార్‌ నియమించిన కమిటీ వరుసగా భేటీ అవుతోంది.

Read More : World Biggest Lightning Video: వామ్మో..770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నమోదు

2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ రిలీజ్‌ టైంలో ఫ్లెక్సిబుల్‌ రేట్‌ నిర్ణయించి.. దాని ప్రకారమే టికెట్ల ధరను పెంచుకోమంటుందా.. లేక అన్ని సినిమాలకు ఒకే ధర అంటుందా అనేది తేలనుంది. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించాలని ప్రేక్షకుల సంఘం నుంచి కమిటీకి ప్రతిపాదన వచ్చింది. ఇటు ఈ భేటీలో ఇటీవల చిరంజీవి, జగన్‌ మధ్య జరగిన చర్చపైనా సమీక్షించనున్నారు కమిటీ సభ్యులు. దీంతో ఇప్పుడు కమిటీ ప్రభుత్వానికి ఏం సిఫార్సు చేస్తుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది. కమిటీలో ఏకాభిప్రాయం వస్తే తప్ప టిక్కెట్ల రేట్ల సమస్యకు పరిష్కారం దొరకే అవకాశం లేదు. ఇటు కమిటీ ఇచ్చే సిఫార్సుల్ని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాలి. దాని ఆధారంగా టిక్కెట్ల రేట్ పై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.