World Biggest Lightning Video: వామ్మో..770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నమోదు

770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దది అని అధికారికంగా వెల్లడించారు అధికారులు.

World Biggest Lightning Video: వామ్మో..770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నమోదు

World Biggest Lightning..770 Km ‘megaflash’

World Biggest Lightning..770 km ‘megaflash’ : వర్షా కాలంలో చిరుజల్లులు, భారీ వర్షాలు కురుస్తుంటాయి. వాటితో పాటు కారుమబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు కూడా హడలెత్తిస్తుంటాయి. మెరుపులు పెద్ద వెలుగుతో అలా తళుక్కుమని ఇలా మాయం అయిపోతుంటాయి. అబ్బా కాసేపుంటే చూసేవాళ్లం కదా అనుకుంటాం. కానీ కన్నుమూసి తెరిచేలోపు మాయం అయిపోతాయి.

కానీ ఓ మెరుపు మాత్రం అలా కాదు అతి పెద్ద ఏకంగా మెరుపును చూసి షాక్ అయ్యారు చాలామంది. ఆ మెరుపు ఎంత పెద్దదంటే..ఏకంగా 770 కిలోమీటర్ల దూరం వ్యాపించింది. అత్యంత ఎక్కువ సమయం మెరిసింది. ఏకంగా 17.1 సెకన్లపాటు నిలిచి ఆశ్చర్యపరిచింది. ఈ మెరుపు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మెరుపు అని అమెరికాలో ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది.

2020 ఏప్రిల్‌లో అమెరికా దక్షిణ ప్రాంతంలో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ మెరుపు సరికొత్త రికార్డును నెలకొల్పిందని..మిసిసిపీ, లూసియానా, టెక్సాస్‌ల మీదుగా ఇది విస్తరించిందని తెలిపింది. 2018 అక్టోబరులో దక్షిణ బ్రెజిల్‌లో నమోదైన మునుపటి రికార్డు కంటే ఈ మెరుపు 60 కిలోమీటర్ల మేర అధికంగా నమోదైనట్లు పేర్కొంది. మెరుపులకు సంబంధించి మరో ప్రపంచ రికార్డునూ డబ్ల్యూఎంఓ నిపుణుల కమిటీ నమోదు చేసింది.

2020 జూన్‌లో ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనాపై ఏర్పడిన ఓ మెరుపు ఏకంగా 17.1 సెకన్లపాటు నిలిచినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలోనే 2019 మార్చిలో నమోదైన మునుపటి రికార్డు కంటే ఇది 0.37 సెకన్లు ఎక్కువ.‘మెరుపు ఘటనలకు సంబంధించిన అసాధారణ రికార్డులివి’ అని డబ్ల్యూఎం ప్రతినిధి రాండాల్ సెర్వెనీ ప్రకటించారు.

ప్రకృతిలో ఉరుములు, మెరుపులు శక్తి సామర్థ్యాలకు కొలమానమని తెలిపారు. మెరుపుల పొడవు..దాని సమయాన్ని గుర్తించడానికి ఉపయోగించే సాంకేతికత ఇటీవలి కాలంలో చాలా మెరుగుపడిందని ఆయన తెలిపారు. టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక వీటిని గుర్తించటం కూడా సులువైంది. శాటిలైట్ లైట్నింగ్ ఇమేజరీ టెక్నాలజీ తదితర సాంకేతికతలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మెరుపులను గుర్తించే సాంకేతికత మెరుగుపడుతున్నందున ఇంకా ఎక్కువ తీవ్రత గల వాటిని గుర్తించే అవకాశం ఉందని సెర్వేని తెలిపారు.