iPhone 15 Price : అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 15.. పండక్కీ కొనాలా? వద్దా?

iPhone 15 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 15 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7iPhone 15 Price
iPhone 15 Price : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? పాత ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ. 50వేల కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఈ పండగ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌ ఇదే. అమెజాన్ ఐఫోన్ 15 దాదాపు రూ.49,999కి దీపావళి డీల్‌లో విక్రయిస్తోంది.
2/7iPhone 15 Price
అసలు లాంచ్ ధర రూ.79వేల కన్నా భారీగా తగ్గింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఐఫోన్‌ అని చెప్పొచ్చు. రూ.50వేల లోపు ధరలో కొనేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ ఐఫోన్ 15 కొనాలా? వద్దా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7iPhone 15 Price
ఐఫోన్ 15 కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు : 1. ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ : ఆపిల్ ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 14 ప్రోకు పవర్ అందిస్తుంది. గేమింగ్, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ, మల్టీ టాస్కింగ్‌కు సపోర్టు ఇచ్చే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
4/7iPhone 15 Price
2. అద్భుతమైన కెమెరా, ఫీచర్లు : 48MP మెయిన్ షూటర్, డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లే, USB-C పోర్ట్, లాంగ్ టైమ్ iOS అప్‌డేట్‌లు సపోర్టు ఉంటుంది. రూ. 50వేల లోపు ధరలో పొందవచ్చు. కంటెంట్ క్రియేటర్లకు అద్భుతంగా ఉంటుంది.
5/7iPhone 15 Price
1. ఐఫోన్ 17 కొనాలా? వద్దా? : కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతుంది. మెయిన్ అప్‌గ్రేడ్‌తో వస్తుంది. ముఖ్యంగా ఏఐ ఫీచర్ల పరంగా మెరుగైన బ్యాటరీ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే కలిగి ఉంది.
6/7iPhone 15 Price
2. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు లేదు : ఈ ఐఫోన్ 15 మోడల్ రెండు జనరేషన్ల పాతది. ఆపిల్ లేటెస్ట్ ఏఐ ఆధారిత సిస్టమ్ కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ పాత A16 చిప్ కారణంగా ఐఫోన్ 15లో సపోర్టు ఇవ్వదు. కొత్త ఏఐ టూల్స్, స్మార్ట్ సిరి అప్‌గ్రేడ్‌లు, క్రియేటివిటీ ఆన్-డివైస్ ఫీచర్లు పొందలేరు.
7/7iPhone 15 Price
3. ఏఐ ఫీచర్లు ఉండవు : ఐఫోన్ 15 మోడల్ చాలా పాతది. అందులో పెద్ద అప్‌గ్రేడ్‌లు లేవు. టెక్ దిగ్గజం ఏళ్ల తరబడి సాఫ్ట్‌వేర్ సపోర్టును కలిగి ఉంది. ఐఫోన్ 16 లేదా ఐఫోన్ 17 సిరీస్‌లోని లేటెస్ట్ మోడల్‌లు అద్భుతమైన ఏఐ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఒకవేళ మీరు ఏఐ ఫీచర్లు వద్దు అనుకుంటే.. ఆపిల్ ఐఫోన్ 15 రూ. 50వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.. అదే ఏఐ ఫీచర్లు కోరుకుంటే మాత్రం ఈ ఐఫోన్ కొనకపోవడమే బెటర్.