Diwali Special Sale 2025 : దీపావళి స్పెషల్ ఆఫర్లు.. అతి చౌకైన ధరకే మోటోరోలా G05 ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Diwali Special Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా మోటోరోలా G05 4జీ ఫోన్ రూ. 7వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Diwali Special Sale 2025 : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? తక్కువ ధరకు కొత్త మోటోరోలా ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. మోటోరోలా G05 4G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ప్రత్యేక సేల్ సందర్భంగా రూ.7వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది.

అమెజాన్ ఇండియాలో రూ. 7,550 ధరకు లభిస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB ర్యామ్ ఉన్నాయి. మోటోరోలా G05 సేల్ ఫోన్ ద్వారా రూ.755 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ 7వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఫోన్ ద్వారా రూ. 226 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేయొచ్చు. కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధర ఉంటుంది.

మోటోరోలా G05 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ మోటోరోలా ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ మానిటర్ రిఫ్రెష్ రేట్ 90Hz కలిగి ఉంది. డిస్‌ప్లే టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 1000 నిట్స్ కలిగి ఉంది. అలాగే, మోటోరోలా ఫోన్ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా 3 కలిగి ఉంది.

మొత్తం 12GB ర్యామ్ సామర్థ్యంతో 4GB వరకు రియల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్‌కు మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా చిప్‌సెట్ పవర్ అందిస్తుంది.

ఈ ఫోన్‌లో ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్, 5200mAh బ్యాటరీ కలిగి ఉంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఫోన్ వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డాల్బీ ఆడియో, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.