BIKER : Sharwa 36 టైటిల్ ఇదే.. ‘బైక‌ర్‌’.. ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌..

శ‌ర్వానంద్ కొత్త సినిమా టైటిల్‌ను బైక‌ర్ (BIKER) అని ఫిక్స్ చేశారు.

BIKER : Sharwa 36 టైటిల్ ఇదే.. ‘బైక‌ర్‌’.. ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌..

Sharwa 36 movie title is BIKER first look out

Updated On : October 20, 2025 / 12:14 PM IST

BIKER : టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఇందులో అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ‌ర్వానంద్ కెరీర్‌లో 36వ సినిమా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి బైక‌ర్‌ (BIKER) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఇందులో శ‌ర్వానంద్ ఏదో రేసులో పోటీప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Bigg Boss 9 Telugu : నాన్న ఎలిమినేట్ అయ్యాడు.. ఇమ్మూ ఎంత ప‌ని చేశావ్‌.. ఇప్పుడు త‌నూజ ప‌రిస్థితి ఏంటో..?

యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ తండ్రి పాత్రలో సీనియ‌ర్ న‌టుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాజీ, అతుల్ కుల‌కర్ణి కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.