Panneerselvam: నిజమైన కార్యకర్తలు నాతోనే ఉన్నారు: పన్నీర్ సెల్వం

ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.

Panneerselvam: ఏఐఏడీఎమ్‌కే పార్టీలోని నిజమైన కార్యకర్తలు తనవెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ నేత పన్నీర్ సెల్వం. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎమ్‌కే పార్టీలో నాయకత్వం కోసం కొంతకాలంగా పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అధికారాలు ఇద్దరి చేతుల్లో సమంగా ఉన్నాయి.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఎల్జీ మధ్య మరో వివాదం

దీంతో ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు. ఒక్కరి చేతుల్లోనే పార్టీ నాయకత్వం ఉండాలని డిమాండ్ చేశారు. ఎవరో ఒకర్ని నాయకుడిగా ఎన్నుకోవాలని కోరారు. ఈ వివాదంపై తాజాగా పన్నీర్ సెల్వం స్పందించారు. ‘‘నిజమైన ఏఐఏడీఎమ్‌కే కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. జయలలిత, ఎంజీ రామ చంద్రన్ అనుచరులు, అభిమానులు నాకే మద్దతు ఇస్తున్నారు. నేను అలాంటి వాళ్ల వెనకే ఉండి, వాళ్ల కోసం పని చేస్తాను. నా భవిష్యత్తును జయలలిత అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు.

Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం

అలాగే తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ, తనపై బాటిళ్లు విసిరేసిన వాళ్లు త్వరలోనే అసలైన ప్రజా తీర్పును చూస్తారంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు పార్టీ అధికారిక మీడియా అయిన ‘నమదు అమ్మ’.. తన ప్రచురణ సంస్థలో పన్నీర్ సెల్వం పేరును తీసేసింది. పన్నీర్ పేరు లేకుండానే పార్టీ విషయాల్ని ప్రచురించింది. దీంతో తన పేరు తొలగించడంపై పన్నీర్ స్పందించారు. అసలు తన పేరు ఎప్పుడు పొందు పరిచారో, ఎప్పుడు తీసేశారో కూడా తెలీదని వ్యాఖ్యానించారు. ప్రచురణ సంస్థలోంచి తన పేరు తొలగించవచ్చని, కానీ, అమ్మ జయలలిత హృదయం నుంచి తన పేరు తీసేయలేరని ఆయన అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు