Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం

అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.

Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం

Droupadi Murmu

Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశా. ఆమె పుట్టింది మయూర్ బంజ్ జిల్లాలోని ఉపర్ బేడా అనే మారుమూల గ్రామంలో. అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.

medical students: ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆందోళన

దీంతో ఈ ఊళ్లో కరెంటు కూడా లేదనే విషయానికి ప్రాధాన్యం లభించింది. దీంతో ఇప్పుడు ఈ ఊరికి కరెంటు ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఒడిశా ప్రభుత్వం. ఉపర్ బేడా పరిధిలో బడాసాహి, దుంగుర్ సాహి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఇందులో దుంగుర్ సాహి అనే ఊళ్లో కరెంటు లేదు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు కిరోసిన్ దీపాలపైనే ఆధారపడతారు. తమ మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేసుకునేందుకు పక్క ఊరు వెళ్లొస్తుంటారు. కరెంటు విషయం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించలేదని ద్రౌపది ముర్ము బంధువులు తెలిపారు. తాజాగా గ్రామానికి విద్యుత్ ఇచ్చే పనులు ప్రారంభించారు అధికారులు. గ్రామానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు.

Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?

ఇక్కడి ఇండ్లు అటవీ భూమిలో ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని అధికారులు చెప్పారు. దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారి నుంచి అనుమతులు రాలేవని, అందువల్లే కనెక్షన్ ఇవ్వలేకపోయామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలగనుంది. కాగా, కొన్ని దశాబ్దాల క్రితమే ద్రౌపది ముర్ము కుటుంబం ఇక్కడి నుంచి దగ్గర్లో ఉండే మున్సిపల్ పట్టణమైన రాయ్ రంగపూర్ వలస వెళ్లింది.