Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఎల్జీ మధ్య మరో వివాదం
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.

Aam Aadmi Party
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య తాజాగా మరో వివాదం తలెత్తింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కూడా కావడం వల్ల అనేక అధికారాలు గవర్నర్, కేంద్రం చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారాల విషయంలో సీఎం కేజ్రీవాల్‌కు, కేంద్రం, గవర్నర్‌కు మధ్య అనేక వివాదాలు నడుస్తుంటాయి.
Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి. దీనికోసం అరవింద్ కేజ్రీవాల్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన తరఫున ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 7న ఎల్జీకి లేఖ రాసింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను సీఎం కార్యాలయం ఎల్జీకి పంపినప్పటికీ, ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఇరవై రోజులవుతున్నా ఈ ఫైల్‌పై ఎల్జీ సంతకం చేయకపోవడంపై వివాదం మొదలైంది. రాష్ట్రానికి కావాల్సిన ఫైళ్లు ఇంకా చాలానే ఎల్జీ వద్ద పెండింగులో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టుకుని కూడా ఎల్జీ ఏ నిర్ణయం తీసుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఎల్జీకి పాలనానుభవం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని విమర్శిస్తోంది. ఎల్జీ సంతకం చేయకపోవడం వల్ల రాష్ట్రంలో చేపట్టాల్సిన ఎన్నో అభివృద్ది పనులు ఆగిపోయాయని ఆరోపిస్తోంది.
Lung Cancer: విటమిన్ బి12 సప్లిమెంట్లతో లంగ్ క్యాన్సర్ వస్తుందా? స్టడీ ఏం చెబుతోంది..
అధికారులు ఎవరైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే సంబంధింత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే ఢిల్లీకి సంబంధించి సీఎం అయినా, మంత్రులైనా ఎల్జీ అనుమతి తీసుకోవాలి. ఎల్జీ అనుమతించిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి తీసుకోవాలి. లేకపోతే సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలు చేయడం కుదరదు. అరవింద్ కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు ఇంకా ఎల్జీ అనుమతి కోసం ఎదురు చూడాల్సి రావడంతో, సీఎం సహా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్జీపై గుర్రుగా ఉంది.