Lung Cancer: విటమిన్ బి12 సప్లిమెంట్లతో లంగ్ క్యాన్సర్ వస్తుందా? స్టడీ ఏం చెబుతోంది..

ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్‌తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పోషకం.

Lung Cancer: విటమిన్ బి12 సప్లిమెంట్లతో లంగ్ క్యాన్సర్ వస్తుందా? స్టడీ ఏం చెబుతోంది..

Lung Cancer

Lung Cancer: విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లను విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అది కూడా మగవారిలోనే. క్లినికల్ ఆంకాలజీ అనే జర్నల్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. దాదాపు 70,000 మందిని అధ్యయనం చేసి తాజా వివరాలు వెల్లడించారు.

Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం

ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్‌తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పోషకం. ఇన్ఫెక్షన్లు రాకుండా చేసి, కణాలు పెరగడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలను, శక్తిని వృద్ధి చేస్తుంది. కంటి చూపును, మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. నరాలు బాగా పనిచేసేలా చేస్తుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి విటమిన్ బి వల్ల. ఇది పాలు, గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత పదార్థాల నుంచే లభిస్తుంది. కానీ, కొందరు యానిమల్ ప్రొడక్ట్స్ తినడానికి ఇష్ట పడరు. అలాంటివారికి బి విటమిన్ లోపం ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు సప్లిమెంట్స్ రూపంలో వీటిని తీసుకుంటారు.

Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?

బి కాంప్లెక్స్ రూపంలో వీటిని తీసుకుంటారు. ఇందులో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 ఉంటాయి. అయితే, విటమిన్ బి6, బి12, ఫొలేట్ సప్లిమెంట్స్ నేరుగా తీసుకుంటే మగవారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందులోనూ పొగతాగే వారిలో మరింత ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆడవారిలో లంగ్ క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఈ విటమిన్లు కారణం కాదు. అలాగే నేరుగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రిస్క్. మల్టీ విటమిన్స్‌తో కలిపి తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.