Pak CJ Gulzar Ahmed : పాకిస్థాన్ లోని హిందువులకు అండగా ఉంటాం : పాక్ ప్రధాన న్యాయమూర్తి

పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Pak CJ Gulzar Ahmed to visit Karak for Diwali celebrations : పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత సోమవారం (నవంబర్ 8,2021) జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఖైబర్ పంఖ్తుఖ్వాలోని కరక్ లోని హిందు ఆలయం అయిన తేరి ఆలయంలో దీపావళి పండుగను జరుపుకున్నారు. అనంతరం ఆయన హిందువులతో స్థానిక సభ్యులతో పాటు ఇతర ప్రాంతాలనుంచి అక్కడికి వచ్చే యాత్రికులకు సంఘీభావం తెలిపారు.

Read more : Uphaar Cinema Fire : సినిమా చూస్తూ 59 మంది సజీవదహనం కేసు..24 ఏళ్లకు తీర్పు..7ఏళ్ల జైలుశిక్ష..భారీ జరిమానా

పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న తరుణంలో పాక్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందువులకు అండగా నిలవటం గమనించాల్సినవిషయం. కరాక్ జిల్లా తేరి గ్రామంలోని శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ ప్రాచీన దేవాలయంపై 2020 డిసెంబరులో కొందరు దుండగులు దాడిచేసి ధ్వంసం చేశారు.ఈ ఘటనపై అప్పట్లో భారతీయ సమాజం నుంచే కాక అంతర్జాతీయంగా కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలుదేశాలకు చెందనివారు ఆగ్రం వ్యక్తంచేసారు. దీనిపై పాక్ ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాదు..ఆ నిర్మాణానికి అయ్యే ఖర్చును నిందితుల నుంచే వసూలు చేయాలని ఆదేశించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

నిర్మాణ పనులు పూర్తికావడంతో దీపావళి రోజున ఆలయాన్ని పునఃప్రారంభించారు. స్థానిక హిందువులు పెద్ద ఎత్తున హాజరై వైభవంగా వేడుక నిర్వహించారు. ఈక్రమంలో ఆలయ నిర్మాణానికి ఆదేశాలిచ్చిన సీజే జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆలయ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా న్యాయూమూర్తి మాట్లాడుతూ.. మైనారిటీల హక్కుల పరిరక్షణకు పాక్ సుప్రీంకోర్టు ఎల్లప్పుడు పాటుపడుతుందనీ..రాజ్యాంగ పరంగా దేశంలోని ఇతర మతాల వారికి లభించే స్వేచ్ఛ, హక్కులు హిందువులకు కూడా ఉంటాయని అన్నారు. మతస్వేచ్ఛను సుప్రీంకోర్టు కాపాడుతుందన్న జస్టిస్ గుల్జార్ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని అటువంటి దాడులకు పాల్పడేవారిని న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయని ఆయన మరోసారి స్పష్టంచేశారు.

Read more : Thieves love story : ఇద్దరు దొంగల లవ్ స్టోరీ.. వీళ్ల స్కెచ్‌లు అంతకు మించి

కాగా పాక్ లో 1920లో హిందూ దేవాలయాన్ని స్థాపించారు. దాన్ని జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్‌కు చెందిన స్థానిక మతగురువు నేతృత్వంలోని కొంతమంది మతోన్మోదులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసారు. దీనిపై జస్టిస్ గుల్జార్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని తిరిగి నిర్మించాలని దానికయ్యే ఖర్చును నిందితుల నుంచి వసూలు చేసి నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలా తిరిగి ఆ ఆలయం పునర్మితం అయ్యింది.

 

ట్రెండింగ్ వార్తలు