Uphaar Cinema Fire : సినిమా చూస్తూ 59 మంది సజీవదహనం కేసు..24 ఏళ్లకు తీర్పు..7ఏళ్ల జైలుశిక్ష..భారీ జరిమానా

ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్‌లో 24 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన కేసులో 24 ఏళ్ల తరువాత కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యజమానులకు శిక్ష విధించింది.

Uphaar Cinema Fire : సినిమా చూస్తూ 59 మంది సజీవదహనం కేసు..24 ఏళ్లకు తీర్పు..7ఏళ్ల జైలుశిక్ష..భారీ జరిమానా

Delhi Uphaar Cinema Fire

Uphaar Cinema Fire case jedgment : ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్‌లో 24 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన కేసులో 24 ఏళ్ల తరువాత పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యజమానులైన ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు కోర్టు ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. సుదీర్ఘకాలంపాటు విచారణ కొనసాగిన ఈ కేసులో ధర్మాసనం థియేటర్ యజమానులకు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు అత్యంత భారీ జరిమానా కూడా విధించింది.

అది దేశ రాజధాని ఢిల్లీ. 13 జులై 1997. ఉపహార్ థియేటర్‌లో ‘బోర్డర్’ సినిమా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకులంతా సినిమాలో లీనమైపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు చుట్టుముట్టాయి. దీంతో థియేటర్ అంతా బీతావహకంగా మారిపోయింది. ప్రాణాలుదక్కించుకోవటానికి ప్రేక్షకులు పరుగులు పెట్టారు. థియేటర్ లో చుట్టుముట్టిన అగ్నికీలల్లో 59మంది సజీవ దహనమైపోగా ప్రాణాలు దక్కించుకోవటానికి ప్రేక్షులు తప్పించుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో మరో 103మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో థియేటర్ యజమానులైన అన్సల్ సోదరులే బాధ్యత వహించాల్సి ఉంది. కానీ సాక్ష్యాలను తారుమారు చేయటానికి యత్నించారు. ఇది కోర్టులో రుజువైంది.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!
ఈ థియేటర్ ప్రమాదంలో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు ప్రేక్షకులను చుట్టుముట్టటంతో తప్పించుకునే మార్గం లేని కొందరు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో తప్పించుకోగలిగారు. సుదీర్ఘంగా నడిచిన ఈ కేసులో పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. గతంలోనే నిందితులకు శిక్ష పడింది. కానీ శిక్ష తప్పించుకోవటానికి తగ్గించుకోవటానికి తాజాగా సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు గాను థియేటర్ యజమానులైన ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 2.25 కోట్ల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

ఇదే కేసులో దోషులుగా తేలిన కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్ చంద్ శర్మ, థియేటర్ ఉద్యోగులు పీపీ బాత్రా, అనూప్ సింగ్‌లకు చెరో ఏడేళ్లు, తలా రూ. 3 లక్షల జరిమానా విధించింది. అన్సాల్‌లకు గతంలో సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తరువాత..వారు విడుదలయ్యారు. ఉపహార్ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు నిందితులు, హర్ స్వరూప్ పన్వార్,ధరమ్‌వీర్ మల్హోత్రా విచారణ కొనసాగుతున్న సమయంలో మరణించారు.

Read more : 20ఏళ్లు జైలు శిక్ష : బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

కాగా..ఈ ప్రమాదంలో మరణించిన యువకుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం..ఈ కేసులో వారు పోరాటం కొనసాగించారు. థియేటర్ యజమానులు సాక్ష్యాలను తారుమారు చేయటానికి ఎన్నో యత్నాలుచేశారు. బాధిత కుటుంబాలను బెదిరింపులకు పాల్పడ్డారు.కానీ మృతుల కుటుంబాలకు చెందినవారు ఏమాత్రం భయపడలేదు.వారి పోరాటం ఆపలేదు. అలా ఈ కేసు సుదీర్ఘకాలం పాటుఅంటే 24 ఏళ్లపాటు విచారణ కొనసాగింది. అలా ఎట్టలకు థియేటర్ యజమానులకు పటియాల కోర్టు శిక్ష విధించి ఒక్కొక్కరికి రూ.2.25 కోట్ల జరిమానా విధించింది.

Read more : వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు