Turkey Man : ధూమపానం మానేయాలని మెటల్ బోనులో తలపెట్టాడు.. ఆ తరువాత ఏం జరిగింది?

ధూమపానం విడిచిపెట్టాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మానలేకపోయాడు. అతనికి ఓ ఐడియా వచ్చింది. అందుకోసం అతనేం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Turkey Man

Turkey Man : ధూమపానం మానేయాలని చాలామంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు టర్కీకి చెందిన ఓ వ్యక్తి మరింత కఠనంగా ప్రయత్నించాడు. తన తలను ఓ మెటల్ బోనులో పెట్టాడు. అవాక్కయ్యారా? చదవండి.

New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

చెడు వ్యసనాల నుంచి బయటపడటానికి కొంతమంది రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఆశ్రయిస్తుంటారు. కౌన్సెలింగ్ లు తీసుకుంటారు. అయితే ఓ వ్యక్తి చేసిన పని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టర్కీ కుతాహ్యా సిటీకి చెందిన ఇబ్రహీం యూసెల్ అనే వ్యక్తి ధూమపానానికి బానిస అయ్యాడు. అయితే అతని తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించిన తరువాత తాను ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ వింత పని చేశాడు.

 

బైక్ నడిపేవారు పెట్టుకునే హెల్మెట్లను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 130 అడుగుల రాగి తీగను వినియోగించి బోను లాగ తయారు చేయించాడు. తనకి సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఎక్కడ దానికి లొంగిపోతాననే భయంతో దాని తాళం చెవి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చాడు. ఇక అతను ఈ అలవాటు నుంచి బయటపడటానికి అతని భార్య ఎంతో మద్దతు ఇచ్చిందట.

Cigibud : సిగరెట్‌ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ .. ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరం

ఈ కథ ఇప్పటిది కాదు. 10 ఏళ్ల నాటిదట. అయితే తాజాగా ఈ స్టోరి బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇతని స్టోరి వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇదేదో బాగుందే.. అని కొందరు.. ఈ అలవాటు నుంచి ఇప్పుడు అతను పూర్తిగా బయటపడ్డాడా? అని కొందరు ప్రశ్నించారు. చెడు వ్యసనాల నుంచి బయటపడాలంటే సరైన కౌన్సెలింగ్ తో పాటు పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.