UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మృతి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. 1948లో జన్మించిన షేక్ ఖలిఫా, 2004లో యూఏఈ అధ్యక్షుడయ్యాడు.

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మృతి

Uae President

Updated On : May 13, 2022 / 5:47 PM IST

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. 1948లో జన్మించిన షేక్ ఖలిఫా, 2004లో యూఏఈ అధ్యక్షుడయ్యాడు. ఆయన యూఏఈలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షేక్ ఖలిఫా అబు దాబి ఎమిరేట్ పాలకుడు కూడా. షేక్ ఖలీఫా పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు.

Hyderabad : హైదరాబాద్‌లో పబ్‌లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్

నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు పలు సూచనలు చేశారు. ఫెడరల్‌ నేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల కోసం నామినేషన్‌ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. షేక్ ఖలిఫా మరణం తర్వాత, రాజ్యాంగం ప్రకారం.. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌమ్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారు. ముప్పై రోజులలో, ఏడు ఎమిరేట్స్ కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాయి.