Allu Arjun: బన్నీని వాయించేసిన పూజా హెగ్డే.. అన్‌సీన్ వీడియో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.....

Allu Arjun: బన్నీని వాయించేసిన పూజా హెగ్డే.. అన్‌సీన్ వీడియో!

Unseen Video From Allu Arjun Ala Vaikuntapuramuloo Goes Viral

Updated On : April 9, 2022 / 1:21 PM IST

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాను తీసుకెళ్లి టాప్‌లో కూర్చోబెట్టింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇంతకాలానికి ఈ చిత్రంలోని ఓ అన్‌సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా ఫైనల్ కట్‌లో లేని ఈ సీన్, హిందీ డబ్బింగ్ వర్షన్‌లో కనిపించింది. దీన్ని తాజాగా నటుడు సుశాంత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సీన్ తెలుగులోనూ బాగుంటుందని.. కానీ ఫైనల్ కట్‌లో ఈ సీన్ లేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే హిందీలో ఈ అన్‌సీన్ వీడియో ఉండటంతో ఆయన వెంటనే దీన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

Allu Arjun: 40 ఏళ్ల వయసులో నేషనల్ స్టార్ డమ్.. నిలబెట్టుకుంటాడా?

ఇక ఈ వీడియోలో నివేదా పేతురాజ్‌తో కలిసి సుశాంత్.. పూజా హెగ్డే ఆఫీస్‌కు వస్తాడు.. అక్కడ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.. కానీ పూజా బన్నీతో ఈ విషయంపై మాట్లాడుతుంటే, అతడు చేసే కామెంట్‌కు బన్నీని ఓ రేంజ్‌లో వాయించేస్తుంది.

ఈ సీన్ తెలుగులో ఎందుకు తీసేశారా అని ఇప్పుడు ప్రేక్షకులు చిత్ర యూనిట్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సీన్‌ను సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈ అన్‌సీన్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sushanth A (@iamsushanth)