Beer-Powered Motorcycle : బీర్‌తో నడిచే మోటార్ సైకిల్ తెలుసా మీకు?

ఇటీవల కాలంలో సరికొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. US కి చెందిన మైఖేల్సన్ బీరుతో నడిచే బైక్‌‌ను రూపొందించాడు. ఇప్పటికే చాలా షోలలో బహుమతులు పొందిన ఈ బైక్‌ను త్వరలో రోడ్డుపైకి తీసుకువస్తాడట.

Beer-Powered Motorcycle : కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. మైఖేల్సన్ అనే వ్యక్తి బీరుతో నడిచే మోటార్ సైకిల్ ను కనిపెట్టాడు. ఇక ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా?

bicycle with square wheels : చతురస్రాకారంలో సైకిల్ చక్రాలు.. కొత్త ఆవిష్కరణకి ఫిదా అవుతున్న నెటిజన్లు

US కి చెందిన మైఖేల్సన్ అనే వ్యక్తి బీర్ తో నడిచే మోటార్ సైకిల్ ను రూపొందించాడు. ఇది గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. గతంలో ఇతను రాకెట్-పవర్డ్ టాయిలెట్ మరియు జెట్-పవర్డ్ కాఫీ పాట్‌లను రూపొందించాడు. ఇక ఈ కొత్త ఆవిష్కరణలో గ్యాస్-పవర్డ్ ఇంజిన్‌కు బదులుగా హీటింగ్ కాయిల్‌ ఉపయోగించాడట. కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకూ వేడి చేస్తుంది. అది బైక్‌ను ముందుకు కదిలేలా చేస్తుంది.

Tallest Shiva Statue In World: నేడు ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఆవిష్కరణ.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..

ఈ బైక్ అన్ని బైక్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుందట. అంతేకాదు చాలా క్రియేటివ్‌గా దీనిని తయారు చేసానని మైఖేల్సన్ అంటున్నాడు. అతనికి తాగే అలవాటు లేదట.. కాబట్టి బీర్‌ను ఇంధనానికి బదులు వినియోగిస్తే ఎలా ఉంటుందని ఆలోచిచాడట. మైఖేల్సన్‌ను ర్యాకెట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇతను తయారు చేసిన బీర్ బైక్ ఇంకా రోడ్డుపైకి రాలేదు కానీ లోకల్‌గా నిర్వహించిన షోలలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిందట. భవిష్యత్‌లో అతను రూపొందించిన బైక్ రోడ్లపై తిరుగుతుందో.. లేక అతని ఇంట్లోనే ఉండిపోతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు