Tallest Shiva Statue In World: నేడు ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఆవిష్కరణ.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..

ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహాన్ని శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో ఆవిష్కరించనున్నారు. దీనిని రాజ్సమండ్ జిల్లాలోని నాథద్వారాలో 369 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ శివుడి విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

Tallest Shiva Statue In World: నేడు ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఆవిష్కరణ.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..

Tallest Shiva Statue In World

Tallest Shiva Statue In World: ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహాన్ని శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో ఆవిష్కరించనున్నారు. దీనిని రాజ్సమండ్ జిల్లాలోని నాథద్వారాలో 369 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ శివుడి విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, ఇతర ప్రముఖులు హాజరవుతారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం రాజస్థాన్ రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు (అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు) ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పలివాల్ తెలిపారు.

Tallest Shiva Statue In World (1)

Tallest Shiva Statue In World

శివుడి ఎత్తయిన విగ్రహం ప్రత్యేకతలు..

– ఉదయపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్ పదం సంస్థాన్ నిర్మించింది.

– ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంది. 20 కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది. కొండపై ఏర్పాటు చేశారు.

– ఈ విగ్రహం ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోయి రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

– ‘విశ్వాస స్వరూపం’ ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహం వద్ద లోపలికి వెళ్ళడానికి నాలుగు లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

– విగ్రహం పూర్తి చేయడానికి పది సంవత్సరాలు పట్టింది. 2012 ఆగస్టులో అప్పటికి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

– విగ్రహ నిర్మాణంలో మూడు వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను ఉపయోగించారు.

– వర్షం, ఎండ నుండి రక్షించడానికి రాగి రంగు విగ్రహానికి జింక్ మిశ్రమంతో పూత పూయబడింది.

– ఈ విగ్రహం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదు.

– ఈ విగ్రహం రూపకల్పన యొక్క విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో జరిగింది.

– విగ్రహం చుట్టూ ఉన్న వేదిక బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి కార్యకలాపాలకు ఆతిథ్యం ఇస్తుంది.

– పర్యాటకులు ఈ ప్రాంతంలో ఆహ్లాదం పొందేందుకు ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ను అందుబాటులో ఉంచారు.