bicycle with square wheels : చతురస్రాకారంలో సైకిల్ చక్రాలు.. కొత్త ఆవిష్కరణకి ఫిదా అవుతున్న నెటిజన్లు

ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓ ఇంజనీర్ రౌండ్‌గా ఉండే సైకిల్ చక్రాలు బోర్ కొట్టాయనుకున్నాడేమో.. చతురస్రాకారంలో ఉండే వీల్స్ క్రియేట్ చేశాడు. ఇక చూడటానికి, తొక్కడానికి ఆ సైకిల్ ఎలా ఉంటుందంటే? చదవండి.

bicycle with square wheels : చతురస్రాకారంలో సైకిల్ చక్రాలు.. కొత్త ఆవిష్కరణకి ఫిదా అవుతున్న నెటిజన్లు

bicycle with square wheels

bicycle with square wheels : ప్రతి ఒక్కరికి సైకిల్ తొక్కిన అనుభవం ఉంటుంది. యూత్ అయితే సైక్లింగ్ చాలా ఇష్టపడతారు. సాధారణంగా సైకిల్ చక్రాలు సర్కిల్ ఆకారంలో ఉంటాయి. రీసెంట్ గా సెర్గీ అనే ఇంజనీర్ సృష్టించిన సైకిల్ చక్రాలు చతురస్రాకారంలో (square wheels) ఉండి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!

టెక్నాలజీ విపరీతంగా దూసుకుపోతోంది. ఎంతోమంది ఎన్నో రకాల కొత్త వస్తువుల్ని కనిపెడుతున్నారు. కొందరు పాత వాటికే కొత్త హంగుల్ని కూడా అద్దుతున్నారు. తాజాగా సెర్గీ గోర్డీయేవ్ (Sergii Gordieiev) అనే ఇంజనీర్ నార్మల్‌గా ఉండే సైకిల్ చక్రాల ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండే చక్రాలను సృష్టించాడు. ఈ చక్రాల ఆకారం మార్పుతో తెచ్చిన సైకిల్ కొత్త ఆవిష్కరణ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ సైకిల్ చక్రాలు రెగ్యులర్ గా ఉండే రౌండ్ వీల్స్‌లా కాకుండా ఎంతో సామర్ధ్యంగా పనిచేస్తాయని ఇంజనీర్ చెబుతున్నాడు. మాసిమో (massimo) అనే ట్విట్టర్ యూజర్ ఈ కొత్త మోడల్ సైకిల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేసాడు. ఒక్క వీల్స్ తప్ప మిగతా అంతా నార్మల్  సైకిల్ మాదిరిగానే ఉన్న ఈ సైకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

ఇక రొటీన్‌గా పాత వాటికే అలవాటు పడిన వారికి ఒక్కోసారి కొత్త ఆవిష్కరణలు అంతగా నచ్చకపోవచ్చును. ఈ సైకిల్‌ను చూసిన తరువాత జనాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రియేషన్ బాగానే ఉన్నా చతురస్రాకారంలో ఉన్న వీల్స్.. వీల్స్ లాగ అనిపించట్లేదని కొందరు అభిప్రాయపడ్డారు. ఏమైనా కొత్త వింత కాబట్టి ఈ ఆవిష్కరణను చూసి జనం ముచ్చటపడుతున్నారు.