Vedam Nagaiah : ‘వేదం’ సినిమా నాగయ్య కన్నుమూత
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాక్ స్టార్ మంచు మనోజ్, అనుష్క ప్రధానపాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ చిత్రంలో రాములు పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన నాగయ్య కన్నుమూశారు.

Vedam Nagaiah
Vedam Nagaiah : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాక్ స్టార్ మంచు మనోజ్, అనుష్క ప్రధానపాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ చిత్రంలో రాములు పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన నాగయ్య కన్నుమూశారు.
దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించిన నాగయ్య యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. నాగయ్య భార్య కొద్దికాలం క్రితం మరణించారు. అప్పటినుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
నాగయ్య ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో మా అసోషియేషన్ నెలకు రూ.2,500 లు ఫించన్ అందిస్తూ అండగా నిలిచింది. రాను రాను ఆరోగ్యం మరింత క్షీణించడంతో గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో కన్నుమూశారు నాగయ్య.