Vijay Vamsi Paidipally Movie To Go On Floors From April
Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్‌బస్టర్స్‌తో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రతీ సినిమా కూడా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలో ఆయన తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసబెట్టి పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే ‘బీస్ట్’ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఈ స్టార్ హీరో పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. తన కెరీర్‌లో 66వ చిత్రంగా రానున్న ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో తెరకెక్కించేందుకు విజయ్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
Mahesh-Vijay: బీస్ట్ పంచాయతీ.. మహేష్-యష్‌లతో విజయ్ పోటీ!
ఇక ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు వంశీ సిద్ధమయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.
దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ చిత్ర రెగ్యులర్ షూట్‌ను ఏప్రిల్ తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Vijay – Mahesh : ఫ్రెండ్ కోసం సూపర్‌స్టార్ మహేశ్
ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ లాంటి స్టార్ హీరో కోసం వంశీ పైడిపల్లి ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.