దళపతి 65 ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..

  • Published By: sekhar ,Published On : December 10, 2020 / 06:47 PM IST
దళపతి 65 ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..

Updated On : December 10, 2020 / 7:26 PM IST

Thalapathy Vijay 65: దళపతి విజయ్ కొత్త సినిమా ఖరారైంది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్. లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ -తెలుగులో ‘కో కో కోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు.



కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న 65వ సినిమా ఇది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ‘మాస్టర్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.