Telangana: ‘బాహుబ‌లి’ సీన్ స్టైల్లో శిశువును తీసుకువెళ్ళారు.. వీడియో వైరల్

'బాహుబ‌లి-1' సినిమా ప్రారంభంలో బుల్లి బాహుబ‌లిని ర‌క్షించ‌డానికి శివ‌గామి (రమ్యకృష్ణ‌) అనేక క‌ష్టాలు ప‌డుతుంది. కుడి చేతితో బుల్లి బాహుబలిని పైకి లేపి న‌దిలో తీసుకుపోతూ, తాను మునిగిపోతూ ముందుకు వెళ్తుంది. తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతోన్న వేళ పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మంథ‌నిలో ఇటువంటి స‌న్నివేశ‌మే చోటుచేసుకుంది. మూడు నెల‌ల శిశువును వ‌ర‌ద‌ల నుంచి కాపాడుకోవ‌డానికి శిశువును బుట్ట‌లో ఉంచి, త‌ల‌పై పెట్టుకుని తీసుకెళ్ళారు.

Rain Effects

Telangana: ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందించిన ‘బాహుబ‌లి-1’ సినిమా ప్రారంభంలో బుల్లి బాహుబ‌లిని ర‌క్షించ‌డానికి శివ‌గామి (రమ్యకృష్ణ‌) అనేక క‌ష్టాలు ప‌డుతుంది. కుడి చేతితో బుల్లి బాహుబలిని పైకి లేపి న‌దిలో తీసుకుపోతూ, తాను మునిగిపోతూ ముందుకు వెళ్తుంది. తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతోన్న వేళ పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మంథ‌నిలో ఇటువంటి స‌న్నివేశ‌మే చోటుచేసుకుంది. వరదల ధాటికి నీళ్ళతో నిండిన ప్రాంతంలో మూడు నెల‌ల శిశువును కాపాడుకోవ‌డానికి కుటుంబ స‌భ్యులు ఆ శిశువును బుట్ట‌లో ఉంచి, త‌ల‌పై పెట్టుకుని తీసుకెళ్ళారు.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

భారీ వ‌రద‌ల ధాటికి భుజాల వ‌ర‌కు నీళ్లు రావ‌డంతో సుర‌క్షిత ప్ర‌దేశానికి చాలా మంది త‌ర‌లి వెళ్ళారు. ఈ నేప‌థ్యంలోనే శిశువును ఇలా బాహుబ‌లి సినిమా సన్నివేశం స్టైల్‌లో తీసుకువెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ జ‌ర్న‌లిస్టు త‌న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో ఈ వీడియో వైల‌ర్ అవుతోంది. కాగా, తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో కురుస్తోన్న వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.