Dhamki Trailer: ధమ్కీ ట్రైలర్.. క్లాస్ కోసం మాస్.. ఊరమాస్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Vishwak Sen Dhamki Trailer Released By Balakrishna
Dhamki Trailer: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. గతంలోనూ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసిన ‘ఫలక్‌నుమా దాస్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ‘ధమ్కీ’ మూవీపై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
Vishwak Sen: దీపావళికి ధమ్కీ ఇస్తానంటోన్న హీరో!
ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ట్రైలర్‌లోనే సినిమా కథను చెప్పేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. బడా కంపెనీ ఓనర్‌గా ఉండే విశ్వక్ సేన్ చనిపోవడంతో, అతడి స్థానంలోకి వెయిటర్‌గా పనిచేసే విశ్వక్ వస్తాడు. ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలను ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. అయితే, కోటీశ్వరుడైన విశ్వక్ సేన్ నిజంగానే చనిపోయాడా, అతడిని చంపే అవసరం ఎవరికి ఉందనేది సినిమాలోని అసలు కథగా దర్శకుడు మనకు చూపించనున్నాడు.
Vishwak Sen : ఇక చెప్పడం ఉండదు.. ‘ధమ్కీ’ ఇవ్వడమే అంటున్న విశ్వక్ సేన్..
ఇక ఈ సినిమాను మరోసారి మాస్ అంశాలతో నింపేశాడు విశ్వక్. తనదైన యాటిట్యూడ్, బోల్డ్ డైలాగులతో చెలరేగిపోయాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్‌ను కలగిలిపి మనకు ‘ధమ్కీ’ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ హీరో. ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.