Vizag Fans Welcomed Akhil In Grand Way For Agent Shoot
Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఏజెంట్’ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను పూర్తిగా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో అఖిల్ ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌లో అఖిల్ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయి, తనను తాను ఏ విధంగా మేకోవర్ చేసుకున్నాడో మనకు చూపించారు.
Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?
అయితే అఖిల్ ఎంతో ప్రటిష్టాత్మకంగా తీసుకున్న ఏజెంట్ సినిమాలో ఏ ఒక్క అంశం కూడా మిస్ కాకుండా చిత్ర యూనిట్‌తో పాటు తాను కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాను వందశాతం ఎంటర్‌టైనర్ మూవీగా అందించాలని చూస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను వైజాగ్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడ అఖిల్ అభిమానులు సందడి చేశారు. అఖిల్‌కు వైజాగ్ ఫ్యాన్స్ చాలా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. స్పెషల్ ఫ్లైట్‌లో వైజాగ్ చేరుకున్న అఖిల్‌కు ఆయన అభిమానులు బైక్ ర్యాలీగా దారిపొడవునా ఆయనకు ఘనస్వాగతం పలికారు.
Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!
ఏజెంట్ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా వైజాగ్ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఏజెంట్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వస్తుందని తెలుస్తోంది. ఇక సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఏజెంట్ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Vizag Die Hard @AkhilAkkineni8 fans welcomed The #Agent in a grand way with Huge bike rally..??#AgentOnAugust12 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/Bz3cmpRGWc
— ?????_?????? (@AkhilFreaks_FC) April 11, 2022