Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

అక్కినేని అభిమానులు, అఖిల్ నుంచి మాస్ హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అఖిల్ కూడా ఆ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వక ఎక్కడో బోల్తా పడుతున్నాడు. తన కెరీర్ కి..

Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

Agent

Agent: అక్కినేని అభిమానులు, అఖిల్ నుంచి మాస్ హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అఖిల్ కూడా ఆ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వక ఎక్కడో బోల్తా పడుతున్నాడు. తన కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చే సినిమా చేయడానికి అఖిల్ ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడు..? ఏ జానర్ సినిమాను సెలక్ట్ చేసుకున్నాడు..? ప్రస్తుతం అఖిల్ ఆశలు పెట్టుకున్న సినిమా విశేషాలేంటో చూద్దాం.

Agent: క్రేజీ అప్డేట్.. అఖిల్ ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్!

అఖిల్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ ట్రై చేశారు కానీ ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోయారు ఆ డైరెక్టర్లు. అయితే ప్రజెంట్ ఆ చాన్స్ సురేందర్ రెడ్డి తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ మీదే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.

Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

ఈమూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న వక్కంతం వంశీ -సురేందర్ రెడ్డి, కాంబోలో కిక్, రేసుగుఱ్ఱం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు ఏజెంట్ కూడా సూపర్ హిట్ అవుతుందని అఖిల్ తో పాటు, అక్కినేని అభిమానులు ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అఖిల్ ఇప్పటి వరకూ లవ్ స్టోరీస్ తో ఫుల్ లెంగ్త్ హీరోగా సక్సెస్ కొట్టాలని చూశాడు. అఖిల్, హెలో, మిస్టర్ మజ్ను సినిమాలపై అఖిల్ అంచనాలు మిస్ ఫైర్ అయ్యాయి. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ సినిమా అఖిల్ కు హీరోగా పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది.

Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!..

ఈ సారి అఖిల్ భారీ వర్కవుట్స్ తో బాడీ బిల్డింగ్ చేసి, స్పై ఏజెంట్ గా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చూజ్ చేసుకున్నాడు. సైరా వంటి కమర్షియల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి, అఖిల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అంతే కాదు, ఏజెంట్ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ తో వర్క్ చేస్తున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంతో పాన్ ఇండియా లెవల్ మేకింగ్ పై దృష్టి పెట్టింది ఈ సినిమా టీమ్. రీసెంట్ గా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యారెక్టర్ తో పోస్టర్ రిలీజ్ చేసి, ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేశారు మేకర్స్. సో ఈ సినిమాతో అయినా అఖిల్ ఆశించిన సక్సెస్ సాధించి స్టార్ హీరోగా నిలబడతాడేమో చూడాలి.