Warren Buffett: బిట్ కాయిన్లు ఎప్పటికీ కొనను: వారెన్ బఫెట్
తన జీవితంలో బిట్ కాయిన్లు ఎప్పటికీ కొనబోనని చెప్పారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ప్రపంచంలోని బిట్ కాయిన్లు అన్నీ కలిపి 25 డాలర్లకే ఇచ్చినా కొనను అని స్పష్టం చేశారు.

Warren Buffett
Warren Buffett: తన జీవితంలో బిట్ కాయిన్లు ఎప్పటికీ కొనబోనని చెప్పారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ప్రపంచంలోని బిట్ కాయిన్లు అన్నీ కలిపి 25 డాలర్లకే ఇచ్చినా కొనను అని స్పష్టం చేశారు. ఎందుకంటే బిట్ కాయిన్లు ఎలాంటి ఆదాయాన్ని సృష్టించలేవని, వాటివల్ల ఏ ఉపయోగమూ లేదన్నారు. ఒక మీడియా సంస్థతో బిట్ కాయిన్ల గురించి తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ‘‘ప్రతి ఆస్తికి ఒక విలువ ఉంటుంది. దాన్ని కరెన్సీలోనే లెక్కిస్తారు. అయితే, అది క్రిప్టో కరెన్సీ మాత్రం కాదు. ఒక వ్యక్తి దగ్గర ప్రపంచంలోని అన్ని బిట్ కాయిన్లు ఉండి.. వాటన్నింటినీ 25 డాలర్లకే ఇస్తానన్నా నేను తీసుకోను.
Bitcoins : 7500 బిట్ కాయిన్లను చెత్తబుట్టలో పడేసిన భార్య..నాసా శాస్త్రవేత్తలతో వెతికిస్తున్న భర్త..
అదే.. దేశంలో ఉన్న అపార్టుమెంట్లలో ఒక్క శాతం అపార్టుమెంట్లకు కలిపి 25 బిలియన్ల డాలర్లు చెల్లించమంటే ఇచ్చేస్తాను. ఎందుకంటే అపార్టుమెంట్లతో రెంట్ వస్తుంది. పొలాలు కొంటే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. కానీ, బిట్ కాయిన్లతో ఏం ఉపయోగం ఉంటుంది. వాటితో ఏం చేసుకోవచ్చు. అందుకే బిట్ కాయిన్లు జీవితంలో కొనను’’ అని వారెన్ బఫెట్ వ్యాఖ్యానించారు.