WhatsApp Users Data : డార్క్ వెబ్‌లో వాట్సాప్ యూజర్ల డేటా సేల్.. 50 కోట్ల మంది ఫోన్ నెంబర్లు లీక్.. మీ డేటా లీక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

WhatsApp Users Data : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. దాదాపు 500 మిలియన్ల (50కోట్ల మంది) వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు.

WhatsApp Users Data : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. దాదాపు 500 మిలియన్ల (50కోట్ల మంది) వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్‌ (Whatsapp Users Mobile Numbers) లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు. సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం.. హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్‌ 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. వాట్సాప్ డేటాబేస్‌లో అమెరికా, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ సహా 84 వేర్వేరు దేశాల నుంచి WhatsApp యూజర్ల మొబైల్ నంబర్లు లీక్ అయినట్టు వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో ఉల్లంఘనకు గురైన డేటాలో ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్ ద్వారానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటాబేస్‌లో 84 వేర్వేరు దేశాలకు చెందిన యాక్టివ్ వాట్సాప్ యూజర్ల మొబైల్ నంబర్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో యూఎస్, యూకే, రష్యా, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ కూడా ఉన్నాయి. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. లీకైన డేటా సెట్‌లో 32 మిలియన్ల అమెరికా యూజర్ రికార్డ్‌లు ఉన్నాయని నివేదిక తెలిపింది.

అదేవిధంగా, ప్రభావితమైన యూజర్ల సంఖ్య ఈజిప్ట్‌లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్‌లో 20 మిలియన్లు, టర్కీలో 20 మిలియన్లుగా ఉన్నాయి. వాట్సాప్ డేటాబేస్‌లో దాదాపు 10 మిలియన్ల రష్యన్ యూజర్లు, 11 మిలియన్లకు పైగా యూకే పౌరుల ఫోన్ నంబర్‌లు ఉన్నాయని ఆరోపించారు.

WhatsApp users’ data on sale _ Check here to know if your data has been leaked

Read Also : WhatsApp Messages : వాట్సాప్‌లో ఎవరిని బ్లాక్ చేయకుండానే అన్‌వాటెండ్ మెసేజ్‌లను పర్మినెంట్‌గా హైడ్ చేయవచ్చు… ఇదిగో ప్రాసెస్..!

నివేదిక ప్రకారం.. హ్యాకర్ ఈ డేటాసెట్లను డార్క్ వెబ్‌ (Dark Web)లో విక్రయిస్తున్నాడు. అమెరికా డేటాసెట్‌ (US Dataset)ను 7,000 డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్‌ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు రూ. 2,04,175), 2,000 డాలర్లు (సుమారు రూ. 1,63,340)గా ఉన్నాయి.

మీ డేటా లీక్ అయిందో లేదో చెక్ చేయడం ఎలా :
డార్క్ వెబ్‌లో మీ మొబైల్ నంబర్ కూడా అమ్మకానికి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? సైబర్‌న్యూస్ మీ డేటా లీక్ అయిందా లేదా అని చెక్ చేసేందుకు అనుమతినిస్తుంది.
https://cybernews.com/personal-data-leak-check/కి వెళ్లండి
– సెర్చ్ ఫీల్డ్‌లో మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ను ఎంటర్ చేయండి.
– ఆ తర్వాత, Check Now పై Click చేయండి.
– మీ డేటా లీక్ అయిందా లేదా అనేది సెర్చ్ రిజల్స్ చూపిస్తుంది.
– మీరు మీ రిజిల్ట్స్ అదే పేజీలో చూడవచ్చు.

మీ డేటా లీక్ అయితే ఏమి చేయాలంటే? :
ఒకవేళ, సెర్చ్ రిజల్ట్స్ మీ ఈ-మెయిల్ ID హ్యాక్ అయిందని చూపిస్తే.. మీరు మీ ఈ-మెయిల్ IDకి పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం మంచిది. ఎల్లప్పుడూ హ్యాక్ చేయడానికి కష్టంగా ఉండే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. మీ మొబైల్ నంబర్ లీక్ అయితే మాత్రం.. తెలియని, అనుమానాస్పద నంబర్‌ల నుంచి వచ్చే కాల్‌లకు సమాధానం ఇవ్వకుండా ఉండటమే మంచిది. అలాగే, మీరు SMSల ద్వారా స్వీకరించే ఏవైనా లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Share Voice Notes : వాట్సాప్‌లో త్వరలో వాయిస్ నోట్స్ కొత్త ఫీచర్ వస్తోంది.. మీ వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా షేర్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు