WhatsApp Messages : వాట్సాప్‌లో ఎవరిని బ్లాక్ చేయకుండానే అన్‌వాటెండ్ మెసేజ్‌లను పర్మినెంట్‌గా హైడ్ చేయవచ్చు… ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రతిరోజూ మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు గొప్ప ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. అయితే, కొన్నిసార్లు కొంతమంది యూజర్లకు ఇబ్బందులు పెట్టే యూజర్లు కూడా ఉన్నారు.

WhatsApp Messages : వాట్సాప్‌లో ఎవరిని బ్లాక్ చేయకుండానే అన్‌వాటెండ్ మెసేజ్‌లను పర్మినెంట్‌గా హైడ్ చేయవచ్చు… ఇదిగో ప్రాసెస్..!

How to get rid of unwanted WhatsApp messages permanently without blocking someone

WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రతిరోజూ మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు గొప్ప ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. అయితే, కొన్నిసార్లు కొంతమంది యూజర్లకు ఇబ్బందులు పెట్టే యూజర్లు కూడా ఉన్నారు. అలాంటి బాధించే యూజర్లను వదిలించుకునేందుకు ఉన్న మార్గం ఒకటే.. వారిని బ్లాక్ చేయడం.. కానీ మీరు వాళ్ల కాంటాక్టును బ్లాక్ చేయకూడదనుకుంటే? సరే, దానికి కూడా ఒక మార్గం ఉంది.

వాట్సాప్ (WhatsApp) చాట్‌లను Archive చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఇంతకుముందు, Archive చేసిన చాట్ మెసేజ్ పంపినప్పుడు లేదా కాల్ చేసినప్పుడు కూడా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అప్రమత్తం చేసేందుకు వీలుంది. కానీ, ఇకపై కాదు. లేటెస్ట్ అప్‌డేట్‌లలో ఒకదాని తర్వాత, WhatsApp ఇప్పుడు Archive చేసిన చాట్‌ల నుంచి అన్ని నోటిఫికేషన్‌లను హైడ్ చేస్తోంది. చాలా కాలంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అందించిన అత్యుత్తమ ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

WhatsAppలో కాంటాక్టును ఎలా Archive చేయవచ్చు?

* యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి WhatsApp యాప్‌ను అప్‌డేట్ చేయండి.
* యాప్‌ని తెరిచి, మీరు నివారించాలనుకునే కాంటాక్ట్ కోసం సెర్ఛ్ చేయండి.
* కాంటాక్ట్‌పై ఎక్కువసేపు Tap చేయండి.
* ఆర్కైవ్‌పై Click చేయండి
* కాంటాక్ట్ Archive సెక్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది.

మీరు ఎప్పుడైనా Archive సెక్షన్ వెళ్లడం ద్వారా Archive Chat నుంచి నోటిఫికేషన్‌లను చెక్ చేయవచ్చు. WhatsApp మిమ్మల్ని కాంటాక్ట్‌ని బ్లాక్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. అలాంటప్పుడు, మీరు అన్‌బ్లాక్ చేయాలని నిర్ణయించుకుంటే తప్ప సంబంధిత యూజర్ల నుంచి నోటిఫికేషన్‌లను, మెసేజ్‌లను లేదా కాల్‌లను స్వీకరించలేరు.

How to get rid of unwanted WhatsApp messages permanently without blocking someone

How to get rid of unwanted WhatsApp messages permanently without blocking someone

WhatsAppలో కాంటాక్టును ఇలా బ్లాక్ చేయండి :

* WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
* మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కాంటాక్టును ఎంచుకోండి
* WhatsApp చాట్‌ని ఓపెన్ చేయండి.
* టాప్‌లో ఉన్న యూజర్ పేరుపై Click చేయండి
* క్రిందికి స్క్రోల్ చేయండి. ‘Block’ ఆప్షన్‌పై బ్లాక్ చేయండి.

వాట్సాప్‌లో మీ స్నేహితుడిని బ్లాక్ చేయకుండా మరొక మార్గం ఉంది. ఆ యూజర్ చాట్‌ను మ్యూట్ చేయండి. అది ఎలా చేయాలంటే?

* WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
* యాప్‌ని ఓపెన్ తర్వాత కాంటాక్ట్‌పై ఎక్కువసేపు Tap చేయండి.
* మ్యూట్ ఆప్షన్‌పై Click చేయండి.
* మ్యూట్ కింద.. WhatsApp యూజర్ల చాట్‌ను 8 గంటలు, 1 వారం లేదా ఎల్లప్పుడూ మ్యూట్ చేయడానికి అనుమతిస్తుంది.
* ఎవరినైనా శాశ్వతంగా మ్యూట్ చేసేందుకు ఎల్లప్పుడూ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైనా సెట్టింగ్‌ని మార్చవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : FIFA World Cup 2022 : వాట్సాప్‌లో FIFA ఫుట్‌బాల్ వరల్డ్ కప్ స్టిక్కర్లు, GIF ఇమేజ్‌లు ఎలా పంపుకోవాలో తెలుసా?