WhatsApp Share Voice Notes : వాట్సాప్‌లో త్వరలో వాయిస్ నోట్స్ కొత్త ఫీచర్ వస్తోంది.. మీ వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా షేర్ చేసుకోవచ్చు!

WhatsApp Share Voice Notes : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపర్చేందుకు కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెసేజింగ్ యాప్ త్వరలో మీ వాయిస్ నోట్‌ (Voice Note)ని స్టేటస్ అప్‌డేట్‌ (Status Update)గా షేర్ చేసే అవకాశాన్ని తీసుకొస్తోంది.

WhatsApp Share Voice Notes : వాట్సాప్‌లో త్వరలో వాయిస్ నోట్స్ కొత్త ఫీచర్ వస్తోంది.. మీ వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా షేర్ చేసుకోవచ్చు!

WhatsApp to soon allow users to share voice notes as status updates

WhatsApp Share Voice Notes : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపర్చేందుకు కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెసేజింగ్ యాప్ త్వరలో మీ వాయిస్ నోట్‌ (Voice Note)ని స్టేటస్ అప్‌డేట్‌ (Status Update)గా షేర్ చేసే అవకాశాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు స్టేటస్ అప్‌డేట్‌ (Status Update)ల వలె ఫొటోలు, వీడియోలను మాత్రమే షేర్ చేయవచ్చు. వాట్సాప్ యాప్ iOS బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.

Wabetainfo ప్రకారం.. WhatsApp మీ స్టేటస్ అప్‌డేట్‌కు వాయిస్ నోట్‌ను షేర్ చేసే సామర్థ్యంపై పని చేస్తోంది. ఆండ్రాయిడ్ కోసం WhatsApp బీటాలో ఫీచర్ అందుబాటులో లేదు. బీటా కోసం iOSలో ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ద్వారా లాంచ్ చేసింది. వాట్సాప్ యూజర్లు మీ స్టేటస్ అప్‌డేట్‌లకు టెక్స్ట్‌ (Text)తో 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ (Voice Note)ను పోస్ట్ చేయగలరని నివేదిక వెల్లడించింది. మీరు మీ Text టైప్ చేసే దగ్గర కనిపించే మైక్రోఫోన్ ఐకాన్ (Microphone Icon)పై Tap చేయవచ్చు.

మీ ప్రైవసీ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకున్న యూజర్లకు మాత్రమే మీ వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌లు షేర్ అవుతాయి. ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసేందుకు WhatsApp బీటా నివేదించింది. టెక్స్ట్ స్టేటస్‌ (Text Status)తో మీ స్టేటస్ అప్‌డేట్‌లకు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయవచ్చు. వాట్సాప్ చాట్‌లో జరిగినట్లుగా.. మీరు ఈ సెక్షన్‌లో ఏ టెక్స్ట్‌ను నమోదు చేయనప్పుడు మైక్రోఫోన్ ఐకాన్ కనిపిస్తుంది.

WhatsApp to soon allow users to share voice notes as status updates

WhatsApp to soon allow users to share voice notes as status updates

మీరు ఎప్పటిలాగే స్టేటస్ అప్‌డేట్ ద్వారా టెక్స్ట్‌కి వెళ్లవచ్చు. మీ వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌లు మీ ప్రైవసీ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకున్న యూజర్లకు మాత్రమే షేర్ అవుతాయని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని గుర్తుంచుకోవాలని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజీలో ఉంది. ఎక్కువ మంది వాట్సాప్ యూజర్లకు అందించలేదు. ఫ్యూచర్ అప్‌డేట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

WhatsApp కాల్స్ ట్యాబ్‌ను యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తోంది. వినియోగదారులు ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ నుంచి నేరుగా కాల్‌లు చేయవచ్చు. కాల్‌ల ట్యాబ్ యూజర్లు డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూడవచ్చు. అంతేకాదు.. కాల్ కార్డ్‌లోని కాల్‌కు సంబంధించిన మొత్తం డేటాను చూడవచ్చు. అయితే, ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. కానీ, బీటా అప్‌డేట్‌లలో అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటాయేతర యూజర్ల కోసం లాంచ్ అవుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి అప్‌డేట్ లేదనే చెప్పాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Elon Musk : ఆపిల్, గూగుల్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే.. ఏం చేస్తాడో చెప్పేసిన ఎలన్ మస్క్.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!