Elon Musk : ఆపిల్, గూగుల్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే.. ఏం చేస్తాడో చెప్పేసిన ఎలన్ మస్క్.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!

Elon Musk : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ కొత్త చీఫ్ ఎలోన్ మస్క్ (Elon Musk) చేయలేనిది ఏమీ లేదు. మస్క్ తలుచుకుంటే చాలు.. ప్రపంచంలో ఏదైనా తన సొంతం చేసుకోగల సమర్థుడు కూడా. అందుకే మస్క్ దృష్టిలో పడిన ప్రతిదీ తన హస్తగతం చేసుకుంటూ పోతున్నాడు.

Elon Musk : ఆపిల్, గూగుల్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే.. ఏం చేస్తాడో చెప్పేసిన ఎలన్ మస్క్.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!

Elon Musk says if Apple and Google ban Twitter, he will make his own smartphone

Elon Musk : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ కొత్త చీఫ్ ఎలోన్ మస్క్ (Elon Musk) చేయలేనిది ఏమీ లేదు. మస్క్ తలుచుకుంటే చాలు.. ప్రపంచంలో ఏదైనా తన సొంతం చేసుకోగల సమర్థుడు కూడా. అందుకే మస్క్ దృష్టిలో పడిన ప్రతిదీ తన హస్తగతం చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పటినుంచో ట్విట్టర్ సొంతం చేసుకోవాలని మస్క్ భావించాడు. అనుకున్నట్టుగానే మస్క్ ట్విట్టర్ కొత్త బాస్‌గా పగ్గాలు అందుకున్నాడు. ఒకవైపు Tesla కంపెనీ CEO కొనసాగుతూనే.. అతి త్వరలో ఆపిల్ iPhone Android ప్లాట్ ఫారంలకు పోటీగా వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుకున్నాడు. ఎందుకంటే.. Apple లేదా Google కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ-Twitter యాప్ స్టోర్‌ల నుంచి నిషేధిస్తే మాత్రం తన సొంత స్మార్ట్‌ఫోన్‌తో రావాలని యోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

Elon Musk says if Apple and Google ban Twitter, he will make his own smartphone

Elon Musk says if Apple and Google ban Twitter, he will make his own smartphone

కంటెంట్ నియంత్రణ సమస్యలపై Google, Apple యాప్ స్టోర్‌ల నుంచి Twitter నిషేధించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో Google లేదా Apple యాప్ స్టోర్‌ల నుంచి ట్విట్టర్ (Twitter) బూట్ చేయడం జరిగితే మస్క్ మార్కెట్లో కొత్త ఫోన్‌ను ప్రవేశపెడతారా? అని ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు బదులుగా మస్క్ నిజంగా కొత్త ఫోన్‌తో వస్తానని సమాధానం ఇచ్చాడు. ఆ పరిస్థితి రాదని తాను కచ్చితంగా ఆశిస్తున్నానని అన్నాడు. ఒకవేళ మరో ఆప్షన్ లేకపోతే మాత్రం.. దానికి ప్రత్యామ్నాయంగా కొత్త ఫోన్ తీసుకొస్తానని మస్క్ క్లారిటీ ఇచ్చాడు. మస్క్ వ్యాఖ్యలకు నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నుంచి ఆసక్తికరమైన స్పందన వచ్చింది. మస్క్ తర్వాత ఏం చేస్తాడో చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నానని బదులిచ్చారు.

Apple, Google యాప్ స్టోర్‌ల నుంచి Twitterను నిషేధించవచ్చా? :
ఎలన్ మస్క్ తమ మార్గదర్శకాలను పాటించకపోతే యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్‌ను బూట్ చేయడం Apple, Googleలకు పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వచ్చే వారంలో అందుబాటులోకి వస్తుందని మస్క్ ఇటీవలే ప్రకటించారు. ఈ వెరిఫికేషన్ ప్లాన్ కోసం యూజర్ల నుంచి 8 డాలర్లు వసూలు చేయాలని మస్క్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. వినియోగదారులకు వారి పేర్ల పక్కన చెక్‌మార్క్‌తో పాటు ప్రత్యేక ఫీచర్లకు యాక్సెస్ అందిస్తుంది. అనుకున్నట్టుగా ఇది జరిగితే, ట్విట్టర్ ఆదాయం భారీగా పెరుగుతుంది. కానీ, దీనివల్ల ట్విట్టర్ కంపెనీ మాత్రమే లాభపడదు. Apple, Google కూడా Twitter పేమెంట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ (Twitter Payment Subscription Plan) నుంచి అనేక ప్రయోజనాలు పొందుతాయి.

Elon Musk says if Apple and Google ban Twitter, he will make his own smartphone

Elon Musk says if Apple and Google ban Twitter, he will make his own smartphone

సాధారణంగా Apple, Google రెండూ తమ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేసిన సబ్‌స్క్రిప్షన్‌లపై రీకాల్ చేసేందుకు కమీషన్ తీసుకుంటాయి. టెక్ దిగ్గజాలు రెండూ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్రోగ్రామ్‌ల కోసం డెవలపర్‌ల నుంచి 15 శాతం వసూలు చేస్తాయి. అయితే ఇప్పుడు ఆ ధరను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఇతర డెవలపర్‌లకు కమీషన్ చెల్లించడం తప్ప అవకాశం లేదు. అయితే ఎలోన్ మస్క్ కమీషన్ వసూలు చేస్తున్నందుకు ఆపిల్, గూగుల్‌లను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. దానిని ఇంటర్నెట్‌పై పన్ను అని మస్క్ అంటున్నాడు. అది ఉండవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్, మస్క్ ఆపిల్, గూగుల్ చెల్లింపు నిర్మాణాన్ని దాటవేసేందుకు ప్రయత్నిస్తే.. వారు ట్విట్టర్‌ను స్టోర్ల నుంచి నిషేధించవచ్చని పేర్కొన్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Check Marks : వచ్చే వారం నుంచే ట్విట్టర్ యూజర్లకు బ్లూ, గ్రే, గోల్డ్ చెక్ మార్కులు.. ఎవరికి ఏయే టిక్ మార్క్ ఇస్తారంటే? ఎలన్ మస్క్ మాటల్లోనే..!