Ram charan-Shankar Movie : కాజల్ రీఎంట్రీ.. భారతీయుడు 2 కోసం చరణ్ సినిమాని పక్కనపెట్టేస్తున్న శంకర్..?
డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ 15వ సినిమాగా, దిల్ రాజు 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా........
- Saketh U
- Published On : August 5, 2022 / 11:40 AM IST
charan shankar movie
Ram charan-Shankar Movie : డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ 15వ సినిమాగా, దిల్ రాజు 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ – శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాని మొదలుపెట్టారు. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదలవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
కమల్‌హాసన్ – శంకర్‌ల ‘భారతీయుడు 2’ సినిమాలో కాజల్ కూడా ఒక హీరోయిన్. కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ నుంచి సినిమాలకి దూరంగా ఉంటుంది కాజల్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన కాజల్ త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రానున్నాను అని ‘భారతీయుడు2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అని, సెప్టెంబర్ 13న ఈ షూటింగ్ ప్రారంభమవనుంది అని తెలిపింది.
BiggBoss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ వీళ్లేనా?
దీంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. RC15 సినిమా ఇంకా షూట్ లోనే ఉంది. ఇప్పుడేమో సెప్టెంబర్ నుంచి భారతీయుడు 2 షూటింగ్ అంటున్నారు. కమల్ హాసన్ కోసం శంకర్ చరణ్ సినిమాని హోల్డ్ లో పెట్టనున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమల్ కూడా త్వరలోనే భారతీయుడు 2 మొదలవుతుందని అన్నారు. ఇప్పుడు కాజల్ కూడా చెప్పడంతో చరణ్ ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ దాకా ఆగాల్సిందేనేమో.
