Woman Suicide (1)
Woman Suicide: న్యూ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఢిల్లీ మెట్రో, యెల్లో లైన్ పరిధిలోని జోర్ బాఘ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. స్టేషన్ నుంచి మెట్రో రైలు హుడా సిటీకి బయల్దేరుతుండగా, ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికురాలు ఉన్నట్టుండి రైలుకు ఎదురుగా పట్టాలపైకి దూకేసింది. రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో, దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అంబులెన్స్ రప్పించి, ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
మృతురాలి వయసు 50 ఏళ్లు ఉంటుందని, ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల అనుమతితో పోస్టుమార్టమ్ నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో మెట్రో రైలు సర్వీసులకు కొంత సమయంపాటు ఆటంకం కలిగింది. ఆ తర్వాత మెట్రో రైలు సేవలు పునరుద్ధరించారు.