Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.

Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

Agnipath (1)

Agnipath: కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీంపై ఒక పక్క విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇండియన్ నేవీలోకి ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా చేరేందుకు నియామక ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రానికి ‘అగ్నిపథ్’లో చేరేందుకు దాదాపు పది వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Arvind Kejriwal: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు. ఎంపికైన వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ నేవీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఐఎన్ఎస్ చిల్కాను సిద్ధం చేస్తోంది. నవంబర్ 21 నుంచి ఈ ట్రైనింగ్ మొదలవుతుంది. మహిళా నావికులకు ఇక్కడ శిక్షణ అందిస్తారు. ‘‘నేవీలో ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా లింగబేధం లేకుండా చూస్తాం. యుద్ధ నౌకల్లో 30 మంది మహిళా సిబ్బంది ఉండాలని ఎప్పుడో నిర్ణయించాం. ఇప్పుడు దీని కోసం అర్హులైన వారిని ఎంపిక చేసే టైమ్ వచ్చింది. సముద్రంలో అన్ని విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తాం’’ అని నేవీ అధికారులు తెలిపారు.

MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు

దేశ సైన్యంలోకి మహిళల్ని ఎంపిక చేయడం 1990 నుంచి ప్రారంభమైంది. అయితే ఎక్కువగా ఆఫీసర్స్ ర్యాంకులకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, 2019-20 నుంచి ఇతర ర్యాంకుల్లో సైతం మహిళల్ని ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం కార్ప్స్ మిలిటరీ ఫోర్స్‌లో వంద మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇక ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా మొత్తం త్రివిధ దళాలకు కలిపి 46 వేల మందిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.