PM Modi Big Announcements : వర్క్ వీసాలు, కొత్త కాన్సులేట్…ఫ్రాన్సులో మోదీ ప్రకటన

ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కోసం పలు వరాలు ఇచ్చారు. మాస్టర్స్ ప్రోగ్రాం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఐదేళ్ల పోస్ట్ స్టడీ వీసాలు ఇస్తామని, మార్సెయిల్ నగరంలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తామని మోదీ ప్యారిస్ పర్యటనలో ప్రకటించారు....

PM Modi Big Announcements In France

PM Modi Big Announcements : ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కోసం పలు వరాలు ఇచ్చారు. మాస్టర్స్ ప్రోగ్రాం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఐదేళ్ల పోస్ట్ స్టడీ వీసాలు ఇస్తామని, మార్సెయిల్ నగరంలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తామని మోదీ ప్యారిస్ ( France) పర్యటనలో ప్రకటించారు. (Work Visas, New Consulate) ఫ్రాన్సులో తమిళ తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ తెలిపారు.

PMJ Jewels : విజయవాడలో అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక ఆకర్షణగా పీఎంజే జ్యువెల్స్ సితార కలెక్షన్‌..!

సెయిన్ నదిలోని ద్వీపంలోని ఒక ప్రదర్శన కళల కేంద్రమైన లా సెయిన్ మ్యూజికేల్‌లో భారతీయ సమాజాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి ఈ ప్రకటనలు చేశారు. భారతీయ పర్యాటకులు రూపాయల్లో యూపీఐ చెల్లింపులు చేసేలా భారత్ ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదివే భారతీయ విద్యార్థులకు 5 సంవత్సరాల దీర్ఘకాలిక పోస్ట్-స్టడీ వీసా ఇవ్వాలని మోదీ నిర్ణయించారు.

Project K : ఊపిరి పీల్చుకో అమెరికా.. ఇండియన్ బిగ్ స్టార్స్ ప్రభాస్, కమల్ వస్తున్నారు..

కొన్ని నెలల్లోగా సెర్గీ ప్రిఫెక్చర్‌లో గొప్ప తమిళ తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ‘‘మీరు ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడి పెట్టండి. ఇదే సరైన సమయం. ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.