PMJ Jewels : విజయవాడలో అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక ఆకర్షణగా పీఎంజే జ్యువెల్స్ సితార కలెక్షన్‌..!

PMJ Jewels : జ్యువెలరీ బ్రాండ్ పీఎమ్‌జే జ్యువెల్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని వివంతా (ది గేట్‌వే) హోటల్‌‌లో అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. ఈ ఆభరణాల ప్రదర్శనలో పీఎమ్‌జే జ్యువెల్స్ రూపొందించిన పీఎమ్‌జే సిగ్నేచర్ కలెక్షన్ ‘సితార’ను ప్రారంభించింది.

PMJ Jewels : విజయవాడలో అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక ఆకర్షణగా పీఎంజే జ్యువెల్స్ సితార కలెక్షన్‌..!

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

Updated On : July 13, 2023 / 11:02 PM IST

PMJ Jewels : దక్షిణ భారత్‌లో అత్యంత ప్రియమైన జ్యువెలరీ బ్రాండ్ పీఎమ్‌జే జ్యువెల్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని వివంతా (ది గేట్‌వే) హోటల్‌‌లో 3 రోజుల వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తోంది. ఈ హోటల్ వేదికగా జూలై 13 నుంచి జూలై 15 వరకు అతిపెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఆభరణాల ప్రదర్శనలో భాగంగా పీఎమ్‌జే జ్యువెల్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎమ్‌జే సిగ్నేచర్ కలెక్షన్ ‘సితార’ను ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో పీఎమ్‌జే కొత్తగా ప్రారంభించిన సితార కలెక్షన్‌ను ప్రదర్శిస్తున్నారు.

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

ఆభరణ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా దేవినేని అనుపమ, పీఎంజే అధికారులు పాల్గొన్నారు. సోషల్‌ సెలబ్రెటీగా సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కూతురు ‘సితార’ను పీఎమ్‌జే జ్యువెల్స్ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇటీవలే ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌ వేదికగా వారం క్రితమే సితార కలెక్షన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం విజయవాడలోని ఆభరణాల ప్రియుల కోసం ఈ ప్రదర్శనను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సితార కలెక్షన్‌లో భాగంగా క్వాలిటీతో పాటు హస్తకళను, కాలాతీత సౌందర్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు.

Read Also : Best Smartphones India : రూ. 60వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? తప్పక తెలుసుకోండి!

పీఎమ్‌జే ఆధ్వర్యంలో అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారుల బృందం చేత ఆభరణాలలోని ప్రతీ భాగాన్ని సంప్రదాయ పద్ధతులతో డిజైన్‌లను రూపొందిస్తున్నారు. ఆభరణ ప్రియులను ఆకర్షించేలా ఈ హ్యండ్‌మేడ్‌ ఆభరణాలను ట్రెడేషన్ మోట్రాన్ కల్చర్‌కు తగినట్టుగా వినూత్నంగా తయారు చేస్తున్నారు. ఈ ప్రదర్శన మొత్తం 3 రోజుల పాటు కొనసాగనుంది.

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

ఈ ప్రదర్శనలో విభిన్న డిజైన్‌లతో ప్రత్యేకంగా ఎంపిక చేసిన వివాహ ఆభరణాలు ఉంటాయి. ముఖ్యంగా నెక్లెస్‌, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు, పోల్కాతో పాటు క్వాలిటీ డైమండ్స్‌తో అలంకరించిన ఆభరణాలు, విలువైన లోహాలతో రూపొందించిన అరుదైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

ఈ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన దేవినేని అనుపమ సితార కలెక్షన్‌, వివాహ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అనుపమ మాట్లాడుతూ.. విజయవాడలో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఎగ్జిబిషన్‌లోని పీఎమ్‌జే జ్యువెల్స్ సితార కలెక్షన్‌ ఆవిష్కరణలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ జంటకు పెళ్లి రోజున ఈ ఆభరణాలు మధుర స్మృతులను అందిస్తాయని నమ్ముతున్నానని తెలిపారు. పీఎమ్‌జే అద్భుత ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రయాణంలో మంచి విజయాన్ని చేరుకోవాలని ఆశించారు.

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

PMJ Jewels unveils prestigious Sitara Collection at Vijayawada’s Biggest Wedding Jewelling Exhibition

విజయవాడ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ., విజయవాడ నగర కస్టమర్‌లకు సితార కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో మహేష్ బాబు కుమార్తె ‘సితార’ ఈ ప్రత్యేక కలెక్షన్‌కు అంబాసిడర్‌గా కొనసాగడం పీఎమ్‌జే జ్యువెల్స్‌కు అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. వైభవంగా ఆవిష్కరించిన సితార కలెక్షన్‌ను గొప్పతనాన్ని ఆస్వాదించేందుకు ఈ వివాహ ఆభరణాల ప్రదర్శనకు ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎ స్టార్’ అనే ఆలోచనతో ఈ కొత్త ఆభరణ శ్రేణిని తీసుకువచ్చామని పీఎమ్‌జే జ్యువెల్స్ సౌత్ హెడ్ హైదర్ అలీ అన్నారు. సితార కలెక్షన్‌ను విజయవాడలో ఆవిష్కరించడం, ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read Also : Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్.. జూలై 14 నుంచి అదిరే ఆఫర్లు.. రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!