Project K : ఊపిరి పీల్చుకో అమెరికా.. ఇండియన్ బిగ్ స్టార్స్ ప్రభాస్, కమల్ వస్తున్నారు..
ప్రభాస్ ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ ని అమెరికాలో జరగబోతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కి..

Prabhas Kamal Hasaan Deepika Padukone attend comic con event
Project K : ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఇండియన్ బిగ్ స్టార్స్ చాలా మంది నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (Kamal Hasaan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ K అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
Manchu Manoj : మా అక్కని చూస్తే చాలా గర్వంగా ఉంది.. లక్ష్మి మంచు పై మనోజ్ కామెంట్స్!
అయితే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా లాంచ్ చేయబోతుంది. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది సినిమా ప్రేమికులు, కామిక్ బుక్స్ అభిమానులు కి విచ్చేస్తారు. ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K చరిత్ర సృష్టించింది. ఇక కార్యక్రమానికి చిత్ర యూనిట్ నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది అందరిలో ఆసక్తి నెలకుంది.
Project K : ప్రాజెక్ట్ K ‘మిస్టరీ’ పై ప్రభాస్ ట్వీట్
తాజాగా దీని పై మూవీ టీం క్లారిటీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొనబోతున్నారు. జులై 19 రాత్రి పార్టీతో మొదలయ్యే ఈ ఈవెంట్ 23 వరకు జరుగుతుంది. జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీం పాల్గొననున్నారు. ఇక ఇండియా తరుపు నుంచి కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్తున్న మొదటి హీరోలు ప్రభాస్ అండ్ కమల్ కావడంతో వారి అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.