Manchu Manoj : మా అక్కని చూస్తే చాలా గర్వంగా ఉంది.. లక్ష్మి మంచు పై మనోజ్ కామెంట్స్!
మంచు లక్ష్మిని చూస్తే తనకి చాలా గర్వంగా ఉందంటూ మంచు మనోజ్ ఒక పోస్ట్ వేశాడు. ఇంతకీ మంచు లక్ష్మి ఏమి చేసిందో తెలుసా..?

Manchu Manoj post on Lakshmi Manchu adopted government schools
Manchu Manoj : మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మి (Lakshmi Manchu) ని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ఒక పోస్ట్ వేశాడు. ఇంతకీ మంచు లక్ష్మి ఏమి చేసిందో తెలుసా..? నటిగా, యాంకర్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మి.. సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ తన గొప్ప మనసుని చాటుతుంటుంది. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఒక ఎన్జీవోని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది.
Renu Desai : రేణూ దేశాయ్ పోస్ట్ అతడిలో మార్పు తీసుకు వచ్చిందట.. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసా..?
అలా దత్తత తీసుకున్న పాఠశాలలో అత్యాధునిక వసతులు, స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య అందించేలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఇక ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుంది. ఈ విషయం గురించే మనోజ్ పోస్ట్ వేశాడు.
Kalyaan Dhev : కూతుర్ని మిస్ అవుతున్నా అంటూ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ పోస్ట్..
“జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మా అక్కని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రయత్నం పిల్లల భవిషత్తు పై ఎంతో ప్రభావం చూపనుంది. ఇందుకు సహాయ పడిన గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి గారికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మనోజ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ (What The Fish) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో కూడా ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుందని, మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక కథతో రాబోతుందని మేకర్స్ తెలియజేశారు.
View this post on Instagram