Yogi Adityanath
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ 112కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎంను హత్యచేస్తానంటూ బెదిరించాడు. 112 అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు కాల్ చేయడానికి యూపీ ప్రభుత్వం జారీ చేసిన ట్రోల్ ఫీ నెంబర్. అంతేకాదు.. కాలర్ యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్‌కు కూడా మెస్సేజ్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి డీపీ అల్లా అనే పదంతో ఫొటోను కలిగి ఉంది. వెంటనే అప్రమత్తమైన యూపీ యాంటీ టెర్రర్ స్వ్కాడ్ (ఏటీఎస్) ఫోన్ చేసిన వ్యక్తిని రిహాన్‌గా గుర్తించారు.
సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి సమయంలో వాట్సాప్ నెంబర్ 112కి మెస్సేజ్ వచ్చింది. ఇందులో ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపుకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నింతుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.
యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌కు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. గతంలో పలు సార్లు యూపీ సీఎంను చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. వారం రోజులక్రితం కూడా ఓ ఫేక్‌బుక్ మేస్సేజ్ ద్వారా చంపేస్తామని బెదిరించారు. అతన్ని గుర్తించిన పోలీసులు అదుపు తీసుకున్నారు.