UP CM Yogi Adityanath: ఇప్పుడు మాఫియా ఎవర్నీ భయపెట్టలేదు.. అతిక్ అహ్మద్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యూపీ సీఎం యోగి

2017 కంటే ముందు యూపీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉండేవి. ఇప్పుడు ఏ జిల్లాలోనూ అల్లర్లు లేవు. యూపీని అల్లర్లు రహితంగా మార్చింది బీజేపీ ప్రభుత్వమే అని సీఎం యోగి అన్నారు.

UP CM Yogi Adityanath: ఇప్పుడు మాఫియా ఎవర్నీ భయపెట్టలేదు.. అతిక్ అహ్మద్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యూపీ సీఎం యోగి

UP CM Yogi Adityanath

Updated On : April 18, 2023 / 1:21 PM IST

UP CM Yogi Adityanath: యూపీలో పెట్టుబడులు పెట్టేవారి ప్రతి మూలధనానికి రక్షణ కల్పిస్తాం, ఇప్పుడు మాఫియా ఎవర్నీ భయపెట్టలేదు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్ సోదరులు హత్య తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలపై యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా స్పందించారు. మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు బేషుగ్గా ఉన్నాయని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి ఆధిత్యనాథ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

యూపీ గుర్తింపు ధ్వంసమైన కాలం ఉందని, యూపీ గుర్తింపు మళ్లీ వస్తోంది. ఇప్పుడు యూపీ అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉందని అన్నారు. 2017 కంటే ముందు శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉండేవని అన్నారు. ఇప్పుడు యూపీలోని ఏ జిల్లాలోనూ అల్లర్లు లేవు. యూపీని అల్లర్లు రహితంగా మార్చింది మన ప్రభుత్వం అంటూ యోగి అన్నారు.

Atiq Ahmed Murder: హత్యకు ముందు అతీక్ అహ్మద్ మాట్లాడిన చివరి మాటలు ఇవే

గతంలో యూపీలో రోజూ అల్లర్లు జరిగేవి. ఇప్పుడు లా రూల్ ఉంది. ఆరేళ్లలో ఎలాంటి కర్ఫ్యూ విధించలేదని అన్నారు. గత మూడు రోజుల క్రితం యూపీ మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్ సోదరుల మరణం సంచలనంగా మారింది. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అతిక్ సోదరుల మరణం తరువాత రెండురోజుల పాటు సీఎం యోగి ఆధిత్య నాథ్ నిత్యం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.