ysrcp
ys vijayamma: వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని తాను భావిస్తున్నట్లు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. ఇవాళ ఆమె వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. విమర్శలకు తావు ఇవ్వకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీకి తాను అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి మద్దతుగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉండడం సరికాదని ఆమె చెప్పారు. విమర్శలు చేసేవారికి తమ విధానాలే సమాధానం చెబుతాయని అన్నారు. రెండు పార్టీల్లో ఎలా ఉంటానన్న విమర్శలు రాకుండా చూసుకోవాలని ఆమె అన్నారు. ఏపీలో కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. తల్లిగా జగన్ కు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. తెలంగాణలో వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు షర్మిల పార్టీ పెట్టారని విజయమ్మ చెప్పారు. షర్మిలకు అండగా ఉంటానని అన్నారు. ‘ఇంతకు ముందు వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇప్పుడు జరగనుంది ఒక ఎత్తు’ అని చెప్పారు.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎక్కడైనా అధికారం కోసమే పార్టీలు పుడతాయని, అయితే, ఏపీలో ప్రజలకు ఇచ్చిన మాట కోసమే వైసీపీ పుట్టిందని ఆమె చెప్పారు. మొదటి నుంచీ వైసీపీకి అండగా ప్రజలు ఉన్నారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలు నెరవేర్చాలన్నదే జగన్ తపన అని విజయమ్మ అన్నారు. జగన్ ఓ మాస్ లీడర్ అని చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోడమే జగన్‌కు తెలుసని అన్నారు.
jagan: 2009లో పావురాల గుట్టలో సంఘర్షణ ప్రారంభమైంది.. మా గెలుపు ఆపడం ఎవరితరమూ కాదు: జగన్
జగన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆమె చెప్పారు. రాజకీయ వ్యవస్థలు అన్నీ కలిసి జగన్‌పై దాడి చేశాయని ఆమె అన్నారు. జగన్‌పై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. జగన్‌ను రెండోసారీ ముఖ్యమంత్రిని చేస్తారన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. తన జీవితం జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్ ఎల్లప్పుడూ చెప్పేవారని అన్నారు. ప్రతి మనిషినీ వైఎస్సార్ ప్రేమించారని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమను కాంగ్రెస్ పార్టీ వదిలేసినప్పటికీ ప్రజలు అక్కున చేర్చుకున్నారని ఆమె అన్నారు. జగన్ మంచి ముఖ్యమంత్రిగా రాణిస్తున్నాడని అన్నారు.