jagan: 2009లో పావురాల గుట్ట‌లో సంఘ‌ర్ష‌ణ ప్రారంభ‌మైంది.. మా గెలుపు ఆప‌డం ఎవ‌రిత‌ర‌మూ కాదు: జ‌గ‌న్

గుంటూరు జిల్లా చిన‌కాకానిలో వైసీపీ ప్లీన‌రి ప్రారంభ‌మైంది. అంత‌కుముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌తో ఆయ‌న‌ భార్య‌ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారు.

jagan: 2009లో పావురాల గుట్ట‌లో సంఘ‌ర్ష‌ణ ప్రారంభ‌మైంది.. మా గెలుపు ఆప‌డం ఎవ‌రిత‌ర‌మూ కాదు: జ‌గ‌న్

Jagan Delhi Tour

jagan: గుంటూరు జిల్లా చిన‌కాకానిలో వైసీపీ ప్లీన‌రి ప్రారంభ‌మైంది. అంత‌కుముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌తో ఆయ‌న‌ భార్య‌ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారు. అనంత‌రం ప్లీన‌రీలో జ‌గ‌న్ పాల్గొని మాట్లాడుతూ… 2009, సెప్టెంబరు 25న పావురాలగుట్టలో సంఘర్షణ ప్రారంభ‌మైంద‌ని చెప్పారు.

Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మ‌రో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స‌

త‌మ పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో అధికారంలోకి వ‌చ్చాక జరిగిన పరిణామాల‌ను ప్ర‌స్తావించారు. తాను చేసిన‌ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చిందని ఆయ‌న చెప్పారు. త‌న తండ్రి వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసమే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింద‌ని ఆయ‌న అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా‌న‌ని ఆయ‌న చెప్పారు. ఏపీలో త‌న‌కు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ఇచ్చారని, తాము 151 స్థానాల్లో విజయం సాధించామ‌ని గుర్తుచేశారు. టీడీపీని మాత్రం దేవుడు 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లకు పరిమితం చేశాడని ఆయ‌న అన్నారు. ఏపీ ప్ర‌జ‌లు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి మాయం చేసే పార్టీలను చూశార‌ని టీడీపీని ఉద్దేశించి చెప్పారు.

Chintamaneni: అందుకే కోడి పందేలు జరిగిన చోటు నుంచి వెళ్ళిపోయాను: చింతమనేని ప్రభాకర్

తాము మాత్రం మేనిఫెస్టోను ప్రజల ముందే ఉంచి, అందులోని 95 శాతం హామీలను అమలు చేశామ‌ని అన్నారు. రైతులపై మమకారం ఎలా ఉంటుందో వైసీపీ పాలన నిరూపించింద‌ని చెప్పారు. త‌మ‌పై ఎన్ని నింద‌లు వేసిన‌ప్ప‌టికీ ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. త‌మ పాల‌న చూసి కొంద‌రిని భ‌యం వేస్తోంద‌ని టీడీపీని ఉద్దేశించి అన్నారు. వారు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని చెప్పారు. త‌న‌కు ప్ర‌జ‌ల అండ ఉంద‌ని చెప్పారు. క‌డుపు మంట‌తో కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా త‌మను ఆప‌లేర‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కొంద‌రు అప్ర‌తిష్ఠ పాలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. త‌మ గెలుపు ఆప‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు.