Chintamaneni: అందుకే కోడి పందేలు జరిగిన చోటు నుంచి వెళ్ళిపోయాను: చింతమనేని ప్రభాకర్

కోడిపందాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావ‌డంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి త‌నకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయ‌న తెలిపారు.

Chintamaneni: అందుకే కోడి పందేలు జరిగిన చోటు నుంచి వెళ్ళిపోయాను: చింతమనేని ప్రభాకర్

Chintamaneni

Chintamaneni: హైద‌రాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం చినకంజర్లకు స‌మీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడి నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెళ్ళిపోయారు. అక్కడ కోడి పందేలు నిర్వహించిన వారిలో చింతమనేని ఒక‌రని తెలంగాణ‌ పోలీసులు చెప్పారు. దీనిపై ఏలూరులో చింతమనేని ప్రభాకర్ 10 టీవీతో మాట్లాడారు.

Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మ‌రో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స‌

కర్ణాటకలో జరిగిన కోడి పందేల్లో పాల్గొన్న మాట వాస్తవమేన‌ని, అక్కడి నుంచి వస్తుంటే పటాన్‌చెరులో భోజనం కోసం త‌న‌ను పిలిచారని చింత‌మ‌నేని తెలిపారు. భోజనం చేసిన తర్వాత కోడి పందేలు నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లానని చెప్పారు. తాను కోడిపందేలు నిర్వహించాన‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేదని చెప్పారు. కోడిపందేలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావ‌డంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి త‌నకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయ‌న తెలిపారు.