Monsoon Gut Problems
Monsoon Gut Problems : వర్షాకాలం అనేక రకాల జీర్ణశయాంతర రుగ్మతలను మోసుకువస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, వాంతులు , విరేచనాలు వంటి జీర్ణసంబంధిత సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం. శిశువుల నుండి వృద్ధుల వరకు ఎవరినైనా ఈ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. సాధారణ కడుపు దోషాలు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి ప్రాణాంతకమైనవి కావు.
READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !
కడుపు ఉబ్బరం ;
కడుపులో, అనగా ప్రేగులలో గ్యాస్ పేరుకుపోయినప్పుడు ఉబ్బరం ఏర్పడుతుంది, దీని వలన అసౌకర్యంగా ఉంటుంది. ఉబ్బరానికి కారణాలకు సంభంధించి త్వరగా ఆహారాన్ని తినేయటం, కార్బోనేటేడ్ పానీయాలు తాగడం, ఎక్కువ మోతాదులో భోజనం చేయడం , బీన్స్, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి గ్యాస్-ఉత్పత్తి చేసే ఆహారాలు తినడం ఒత్తిడిని కలిగించటం తోపాటు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. ఉబ్బరం సమస్యతో భవిష్యత్తులో రాకుండా నిరోధించడానికి ముందుగా అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.
READ ALSO : Banana : వర్షకాలంలో అరటి పండు తినకూడదా ?
మలబద్ధకం ;
మలబద్ధకం అనగా మలం విసర్జన చేయటం కష్టతరంగా మారుతుంది. వ్యర్థ పదార్థాలు జీర్ణవ్యవస్థ ద్వారా చాలా నెమ్మదిగా కదులుతాయి. మలబద్ధకం యొక్క సాధారణ కారణాలు తగినంత ద్రవాలు త్రాగకపోవడం, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, నొప్పి నివారణ మందులు లేదా యాంటాసిడ్లు వంటి మందులు తీసుకోవడం. మలబద్దకానికి తగిన చికిత్స చేయాలంటే ముందుగా కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.
READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !
వాంతులు ;
వికారం లేదా అనారోగ్యం కారణంగా కడుపు నుండి వాంతుల రూపంలో ఆహారం , ద్రవం బయటకు వెళ్లిపోతుంది. వాంతికి సాధారణ కారణాలు ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ అలర్జీలు, వేగనంగా ఆహారం తినడం, చెడిపోయిన ఆహారం తినడం, ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సేవించటం వంటి కారణాలు చెప్పవచ్చు. సరైన చికిత్స పొందేందుకు వాంతికి కారణాన్ని గుర్తించటం చాలా ముఖ్యం.
READ ALSO : Swine Flu During Rainy Season : వర్షకాలంలో స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
అతిసారం ;
ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం నుండి నీరు లూజ్ మోషన్ రూపంలో బటయకు వేళ్ళే పరిస్ధితని విరేచనాలు అంటారు. దీనినే అతిసారంగా కూడా చెప్పవచ్చు. అతిసారం యొక్క సాధారణ కారణాలలో సాల్మొనెల్లా లేదా E. కోలి వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రోటవైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, గియార్డియా లాంబ్లియా వంటి పరాన్నజీవులు, కొన్ని రకాల మందులు, యాంటీబయాటిక్స్ , కొన్ని ఆహార అలెర్జీలు ఉన్నాయి. విరేచనాలకు తగిన చికిత్స చేయడానికి కారణాన్ని కనుగొనటం చాలా ముఖ్యం.
READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
గుండెల్లో మంట ;
కడుపులో నుండి ఆమ్లం అన్నవాహిక లోకి రిఫ్లక్స్ అయినప్పుడు గుండెల్లో మంట వస్తుంది, దీని వలన ఛాతీ , గొంతులో మంట వస్తుంది. గుండెల్లో మంట యొక్క సాధారణ కారణాలు అధికమోతాదులో భోజనం తినడం, అతిగా తినడం, కాఫీ , ఆల్కహాల్ వంటి మసాలా ఆహారాలు. ఆమ్ల పానీయాలు తీసుకోవడం, సిగరెట్లు తాగడం, ఆస్పిరిన్ , ఇబుప్రోఫెన్ వంటి కొన్ని మందులు తీసుకోవడం. భవిష్యత్తులో గుండెల్లో మంట రాకుండా నిరోధించాలంటే కారణాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం.
READ ALSO : Ice Cream : వర్షకాలంలో ఐస్ క్రీం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
ఈ సాధారణ కడుపు దోషాలను జీవనశైలి మార్పులు, పుష్కలంగా నీరు,పండ్లు, కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎక్కువ కెఫిన్ , ఆల్కహాల్‌ను నివారించడం వంటి సహజ నివారణలతో నిరోధించవచ్చు.ధూమపానం చేసేవారైతే దానిని మానేయడం. జీవనశైలిలో మార్పులు చేసినప్పటికీ లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.