Swine Flu During Rainy Season : వర్షకాలంలో స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

H1N1 వైరస్ యొక్క సాధారణ లక్షణాలు కాలానుగుణంగా ఇన్ఫ్లుఎంజా మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి, చలి, అలసట ,కొన్నిసార్లు వాంతులు , విరేచనాలు అవుతాయి.

Swine Flu During Rainy Season : వర్షకాలంలో స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Swine Flu During Rainy Season

Swine Flu During Rainy Season : వర్షాకాలం అనేది అనేక ప్రాణాంతక వైరస్‌లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. H1N1 వైరస్‌ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా అవసరం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవటం ద్వారా మాత్రమే ఈ తీవ్రమైన అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.

READ ALSO : Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

H1N1 వైరస్ అంటే ఏమిటి?

H1N1 వైరస్, దీనినే స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు, ఇది ఒక అంటువ్యాధి శ్వాసకోశ వైరస్. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిబారినపడుతున్నారు. ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా వైరస్. మానవులలో తేలికపాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. గత దశాబ్ద కాలంలో H1N1 వ్యాప్తి మానుషులు, జంతువులలో ఎక్కువ ఉంది.

READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

H1N1 ఫ్లూ లక్షణాలు ;

H1N1 వైరస్ యొక్క సాధారణ లక్షణాలు కాలానుగుణంగా ఇన్ఫ్లుఎంజా మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి, చలి, అలసట ,కొన్నిసార్లు వాంతులు , విరేచనాలు అవుతాయి. కొందరిలో ముక్కు కారడం , ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో, న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Rainy Season Health : వర్షకాలంలో రోగాలు తెచ్చిపెట్టే కలుషితనీరు, ఆహారం!

H1N1 ఫ్లూ కారణాలు:

H1N1 వైరస్ సోకిన వ్యక్తితో సంపర్కం వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తి నుండి లాలాజలం, శ్లేష్మం వంటి శ్వాసకోశ స్రావాలతో ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన ఉపరితలాలు , డోర్ నాబ్‌లు,బొమ్మలు వంటి వస్తువులను తాకటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.

READ ALSO : Monsoon Fever : వర్షకాలంలో వచ్చే జ్వరాలతో జాగ్రత్త!

H1N1 ఫ్లూ చికిత్సలు, జాగ్రత్తలు ;

H1N1 వైరస్ చికిత్సలో సాధారణంగా విశ్రాంతి అవసరం. వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలి. అసౌకర్యాన్ని తగ్గించడానికి అవసరమైన ద్రవాలను తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, యాంటీబయాటిక్ చికిత్స అవసరం అవుతుంది. కాబట్టి వెంటనే వైద్య సహాయం పొందటం ముఖ్యం. H1N1 వైరస్ నుండి రక్షించడానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

READ ALSO : Yogurt Face Pack : వర్షకాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెరుగు ఫేస్ ప్యాక్!

వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు (CDC)లలో గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు , ఆస్తమా లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులతో సహా వైరస్ నుండి వచ్చే అధిక ప్రమాదం ఉన్నవారికి టీకాలు వేయించాలి.

READ ALSO : Flies : వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడదా?

H1N1 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి మంచి పరిశుభ్రత అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. H1N1 వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. ఆహారం తీసుకోవాటానికి ముందు సబ్బు నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండటం , దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు , ముక్కును కప్పి ఉంచడం చాలా ముఖ్యం.