Flies : వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడదా?

నిత్యం వ్యర్థాలను ఇంట్లో నిల్వవుంచటకుండా పారవేయడం చాలా ముఖ్యం. ఇంట్లో ఎలాంటి దుమ్ము, ధూళీ లేకుండా చేయాలి. శుభ్రపరిచిన తర్వాత వ్యర్థాలను కూడా సరైన స్థలంలో పడేయాలి. దీని వల్ల ఇంట్లోకి ఈగలు వచ్చే అవకాశం ఉండదు.

Flies : వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడదా?

Flies During Monsoon

Updated On : July 26, 2022 / 11:43 AM IST

Flies : వర్షకాలం ప్రారంభంలో ఇంట్లో అతి పెద్ద సమస్య ఈగలు, దోమలు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు గతంలో కంటే మరింత సురక్షితంగా ఉండాల్సి ఉంది. అదే సమయంలో దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం. అలాగే ఈగలు సైతం ఇబ్బందికరమైన సమస్యగా చెప్పవచ్చు. వీటి నుండి రక్షణ పొందాలంటే ముందుగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగలను వదిలించుకోవచ్చు. వర్షాకాలంలో ఈగలను ఎలా వదిలించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

నిత్యం వ్యర్థాలను ఇంట్లో నిల్వవుంచటకుండా పారవేయడం చాలా ముఖ్యం. ఇంట్లో ఎలాంటి దుమ్ము, ధూళీ లేకుండా చేయాలి. శుభ్రపరిచిన తర్వాత వ్యర్థాలను కూడా సరైన స్థలంలో పడేయాలి. దీని వల్ల ఇంట్లోకి ఈగలు వచ్చే అవకాశం ఉండదు. ఈగలు ముసరకుండా చెత్త డబ్బాలకు మూత పెట్టడం అవసరం. ఇంటి వంటగదిలో సేకరించిన పాత ఆహారం, ఇతర సేంద్రియ వ్యర్థాలకు ఈగలు ఆకర్షితమౌతాయి. డబ్బాలో ఉంచిన వ్యర్థాలను సరిగ్గా కప్పాలి. ఇందుకోసం అవసరమైతే నో టచ్ బిన్‌లను ఉపయోగించాలి. కాలుతో తెరవటం చెత్వ వేసిన వెంటనే మూసివేయబడతాయి, దీనివల్ల వ్యర్థాలు నిత్యం కప్పబడి ఉంటాయి కాబట్టి ఈగల బెడద ఉండదు.

మీ పెంపుడు జంతువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులు శుభ్రంగా లేకుంటే అవి ఈగలను ఆకర్షిస్తాయి. దీని వల్ల అటు పెంపుడు జంతువుకు ఇటు దానిని పెంచుకుంటున్న యజమాని ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా స్నానం చేయిస్తూ శుభ్రత్త పాటించటం మాత్రం మర్చిపోవద్దు. వాటి వ్యర్థాలను శుభ్రం చేయాలి. ఒకవేళా వాటిని ఆరుబటయకు తీసుకువెళ్ళనట్లైతే తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చాక వాటి పాదాలను శుభ్రపరచాలి. లేకుండా ఈగలను ఆకర్షిస్తాయి.

మంచి క్రిమిసంహారక మందులతో మీ ఇంటిని శుభ్రపరచడం ద్వారా ఈగలను వదిలించుకోవచ్చు. ఇంట్లోని ప్రతి గదిలో ఈగలు రాకుండా క్రిమిసంహారక మందులతో శుభ్రంచేయాలి. కిచెన్, డైనింగ్ టేబుల్, బాత్‌రూమ్‌ల వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ నిర్దిష్ట ప్రాంతాలను జాగ్రత్తగా శుభ్రం చేయాలి ఎందుకంటే వర్షకాలంలో తేమ ఉన్న ప్రాంతాలు ఈగలకు ఆలవాలంగా మారతాయి. ఇందుకోసం అవసరమైతే ఈగలు పారద్రోలే స్ప్రేలు, ఫ్లై కిల్లర్ ఉపయోగించవచ్చు. అయితే వీటిని వినియోగించే సమయంలో జాత్తలు తీసుకోవటం మంచిది. అలాగే 1 గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి ద్రావణాన్ని తయారుచేసుకుని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి ఈగలు వెళ్ళిపోతాయి. ఈగలను చంపేందుకు ప్రస్తుతం మార్కెట్లో కొన్ని విద్యుత్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఈగల నుండి దీర్ఘకాలం ఉపయోగకరంగా ఉంటాయి.