A meal maker that reduces bad cholesterol levels and keeps the heart healthy!
Meal Maker : మీల్ మేకర్ లను సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు. మీల్ మేకర్ తో రుచికరమైన వంటకాలను చేయవచ్చు. మీల్ మేకర్ లతో మసాలా కూరలను, మంచురియాను కూడా తయారు చేస్తారు. అలాగే కిచిడి, బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల మీల్ మేకర్ లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
కోడిగుడ్లు, పాలు, మాంసంతో సమానమైన ప్రోటీన్ మీల్ మేకర్లలో ఉంటుంది. కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. మీల్ మేకర్ లను తరచూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
READ ALSO : Blood Sugar : రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడే ఆయుర్వేద మూలికలు ఇవే !
అధికమోతాదులో తీసుకుంటే ;
వీటిని ఎక్కువగా మోతాదులో తీసుకోరాదు. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్ లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగుతాయి. మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతి పరిమాణం పెరుగుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, మలబద్దకం, అతిగా మూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
READ ALSO : నడకతో గుండెపోటు, పక్షవాతం, కేన్సర్‌కు చెక్..!
వీటిలో ఉండే ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిల్చి వాపులు రావడం, కడుపులో గ్యాస్, మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే క్రమంలో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. రోజూ 25 గ్రాముల మీల్ మేకర్ లను మాత్రమే తీసుకోవాలి.